ICC Worldcup 2023: పిల్ల బచ్చా మాటలు.. ‘కోహ్లీ.. నా బౌలింగ్ తట్టుకోలేడు’
X
ప్రపంచ కప్ 2023 క్వాలిఫయర్స్ లో నెదర్లాండ్స్ జట్టు అదరగొట్టింది. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన వెస్ట్ ఇండీస్ ను చిత్తు చేసి.. వరల్డ్ కప్ బెర్త్ ను కన్ఫార్మ్ చేసుకుంది. ఈ క్రమంలో మెగా టోర్నీకి సిద్ధమయ్యేందుకు.. నెల రోజుల ముందే నెదర్లాండ్స్ భారత గడ్డపై అడుగుపెట్టింది. గట్టిగా ప్రాక్టీస్ చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఏకంగా భారత ఆటగాళ్లను నెట్ బౌలర్స్ గా హైర్ చేసుకుంది. ఈ మెగా టోర్నీలో నెదర్లాండ్స్.. తొలి మ్యాచ్ ను హైదరాబాద్ వేదికపై పాకిస్తాన్ తో ఆడనుంది. అంతకంటే ముందు భారత్, ఆస్ట్రేలియాలతో వార్మప్ మ్యాచ్ లు ఆడుతుంది. నవంబర్ 12న బెంగళూరులో భారత్- నెదర్లాండ్స్ మధ్య పోరు ఉంటుంది.
అయితే ఈ మ్యాచ్ కోసం ప్రత్యేక వ్యూహాలు రచించినట్లు డచ్ ఆల్ రౌండర్ లోగాన్ వాన్ బీక్ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీపై దృష్టిపెట్టామని, అతన్ని ఓట్ చేయడానికి ప్లాన్లు రెడీ చేశామన్నాడు. ‘విరాట్ కేవలం 5 బంతుల్లో ఓట్ చేస్తా. మొదటి రెండు బాల్స్ ఓట్ స్వింగర్స్ వేస్తా. ఆ తర్వాత స్లో ఆఫ్ కట్టర్. ఈ బాల్ కు విరాట్ కచ్చితంగా ఫోర్ కొడతాడు. అప్పుడు నేను చికాకు పడినట్లు నటించి.. కెప్టెన్ తో ఏదో మాట్లాడినట్లు నటిస్తా. ఏదో ఒక వైపు చూపించి అటువైపు బౌలింగ్ చేస్తున్నట్లు సూచిస్తా. కానీ, ఆ వైపు బాల్ వేయను. కోహ్లీని మోసం చేసి నాలుగో బాల్ హాఫ్ సైడ్ వేస్తా. అది కూడా అతను ఫోర్ కొడతాడు. దాంతో భారత అభిమానులు ఆనందంలో పొంగిపోతారు. స్టేడియం మొత్తం హోరెత్తుతుంది. కోహ్లీలో కూడా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. నాకు కావాల్సింది కూడా అది. ఆ క్షణంలో పైకి చూసి దేవున్ని.. కోహ్లీని ఔట్ చేయమని కోరుకుంటా. అంతే నా కోరిన మణ్ణించి దేవుడు కోహ్లీని ఓట్ చేస్తాడు’ అని లోగాన్ వాన్ చెప్పుకొచ్చాడు.