Home > క్రీడలు > Netherlands: ‘ఖర్చుల కోసం ఫుడ్ డెలివరీ బాయ్గా పని చేస్తున్నా’: నెదర్లాండ్స్ ప్లేయర్

Netherlands: ‘ఖర్చుల కోసం ఫుడ్ డెలివరీ బాయ్గా పని చేస్తున్నా’: నెదర్లాండ్స్ ప్లేయర్

Netherlands: ‘ఖర్చుల కోసం ఫుడ్ డెలివరీ బాయ్గా పని చేస్తున్నా’: నెదర్లాండ్స్ ప్లేయర్
X

ప్రపంచకప్ లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో సంచలనం జరిగింది. విజయాలతో దూసుకుపోతున్న సౌతాఫ్రికాకకు.. నెదర్లాండ్స్ షాక్ ఇచ్చింది. 9 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నెదర్లాండ్స్ గెలుపులో ఆ జట్టు బౌలర్ల పాల్ వాన్ మీకెరెన్ కీలకం అయ్యాడు. తన పేస్ తో సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కాగా పాల్ మూడేళ్ల కిందట చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మూడేళ్ల కిందట కొవిడ్ టైంలో ఖర్చుల కోసం పాల్ ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేశాడట. ‘కరోనా వల్ల టీ20 వరల్డ్ కప్ వాయిదా పడింది. దాంతో కుటుంబ పోషణ కోసం ఉబెర్ ఈట్స్ లో డెలివరీ బాయ్ గా పనిచేశా’ అని ట్వీట్ చేశాడు.





‘ఈ క్షణంలో క్రికెట్ ఆడుతూ ఉండాల్సి వాన్ని. పరిస్థితి మారిపోయి.. డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నా. దీనివల్లే నా కుటుంబం ముందుకు సాగుతుంది. అనుకోని సంఘటనలు జీవితంలో జరగడం సహజం. నవ్వుతూ ముందుకు వెళ్లండి’ అని ఆ పోస్ట్ లో చెప్పుకొచ్చాడు. గత మ్యాచ్ లో 9 ఓవర్లు వేసిన పాల్.. 4.40 సగటుతో 2 కీలక (మార్క్రమ్, జాన్సన్) వికెట్లు పడగొట్టాడు.




Updated : 18 Oct 2023 4:10 PM IST
Tags:    
Next Story
Share it
Top