Home > క్రీడలు > AFG vs NED: బౌలింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్.. గెలిస్తే సెమీస్ రేసులో!

AFG vs NED: బౌలింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్.. గెలిస్తే సెమీస్ రేసులో!

AFG vs NED: బౌలింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్.. గెలిస్తే సెమీస్ రేసులో!
X

వరల్డ్ కప్ లో నేడు అండర్ డాగ్స్ జట్లు పోటీ పడుతున్నాయి. లక్నోలో ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చిన్న జట్లుగా వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన ఈ జట్లు.. పెద్ద జట్లకు షాక్ ఇచ్చాయి. ఇంగ్లాండ్ ను నెదర్లాండ్స్.. పాకిస్తాన్ ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించి ఆయా జట్ల సెమీస్ ఆశలపై నీళ్లుచల్లాయి. ఇవాళ్టి పోరులో ఆఫ్ఘన్ గెలిస్తే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇప్పటి వరకు 6 మ్యాచ్ లు ఆడిన ఆఫ్ఘన్.. 3 మ్యాచుల్లో గెలిచింది. రన్ రేట్ కాస్త తక్కువగా ఉంటంతో సెమీస్ రేసులో కాస్త వెనకబడి ఉంది. కాగా లక్నో పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండటంతో నెదర్లాండ్స్ బ్యాటర్లకు కష్టమనే చెప్పాలి. ఎందుకంటే మేటి స్పిన్నర్లు ఆప్ఘన్ జట్టులో ఉన్నారు. పెద్ద జట్లకే ఈ స్పిన్నర్లు చెమటలు పట్టించారు. దాంతో నెదర్లాండ్స్ బ్యాటర్లు ఆఫ్ఘన్ స్పిన్నర్లను ఎలా ఎదురుకుంటారో చూడాలి.

తుది జట్లు:

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(సి), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(w), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్

నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), బాస్ డి లీడే, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్




Updated : 3 Nov 2023 2:02 PM IST
Tags:    
Next Story
Share it
Top