ICC World Cup 2023 : టీమిండియాను ఎలా ఓడించాలో మాకు తెలుసు
X
ప్రపంచకప్ లీగ్ స్టేజ్ లో టీమిండియాకు ఇంకా ఒక్క మ్యాచే మిగిలి ఉంది. పసికూన నెదర్లాండ్స్ తో చివరి మ్యాచ్ లో తలపడనుంచి. టోర్నీలో అర్భుత ప్రదర్శన చేస్తూ ప్రత్యర్థికి చెమటలు పట్టించిన డచ్ సేనను తక్కువ అంచనా వేయలేం. భీకర సౌతాఫ్రికాను 38 పరుగుల తేడాతో డించింది. బంగ్లాదేశ్ ను 87 పరుగులతో మట్టికరిపించింది. మిగతా మ్యాచుల్లో ప్రత్యర్థిని ఓడించినంత పనిచేసి అందరికీ షాక్ ఇచ్చింది. కాగా ఆదివారం జరిగే మ్యాచ్ లో డచ్ సేన ఎలాంటి ప్రదర్శన ఇస్తుందనేది కీలకంగా మారింది. ఈ క్రమంలో నెదర్లాండ్స్ ప్లేయర్, భారత సంతతి వ్యక్తి తేజ నిడమనూరి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ ను కచ్చితంగా ఓడించి తీరతామని జోస్యం చెప్పాడు.
‘భారత్ ను ఓడించడానికి మా వద్ద చాలా ప్రణాళికలు ఉన్నాయి. మా వద్ద బౌలింగ్ బలంగానే ఉంది. భారత స్పిన్ ను ఎదుర్కొనే ప్లేయర్లు, ఆ జట్టును ఎదిరించే ఆటగాళ్లు మావద్ద కూడా ఉన్నార’ని అన్నాడు. తేజ వ్యాఖ్యలపై భారత అభిమానులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో తేజ తల్లి పద్మ కూడా భారత్ పై నెదర్లాండ్స్ గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. కాగా వరల్డ్ కప్ కు ముందు నెదర్లాండ్స్ తో జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.