Asian games2023: దేశ ప్రత్యేకతను తెలిపేలా కొత్త జెర్సీ.. ప్రిపేర్ అవుతున్న కుర్రాళ్లు
X
సెప్టెంబర్ వచ్చిందని క్రికెట్ లవర్స్ తెగ ఆనంద పడిపోతున్నారు. ఎందుకంటే ఎన్నడూ చూడని క్రికెట్.. ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చూడబోతున్నాం. ఇప్పటికే ఆసియా కప్ టోర్నీ స్టార్ట్ అయింది. మరో 20 రోజుల్లో వరల్డ్ కప్ మెగా టోర్నీ జరగబోతుంది. దీనికి ముందే టీమిండియా ఆస్ట్రేలియాతో వన్డే క్రికెట్ ఆడనుంది. వీటితో పాటు భారత మెన్ క్రికెట్ మొదటిసారి మెగా టోర్నీలో పాల్గొనబోతుంది. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి చైనా వేదికగా ప్రారంభం కాబోయే ఏషియన్ గేమ్స్ కు భారత పురుషుల క్రికెట్ జట్టు కూడా పాల్గొనబోతుంది. దీనికోసం బీసీసీఐ పూర్తిగా కుర్రాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఆ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా నియమించింది. భారత మహిళా క్రికెట్ జట్టు కూడా ఆసియన్ గేమ్స్ లో పాల్గొంటుంది. ఈ క్రమంలో క్రికెట్ టీం జెర్సీ ఇదేనంటూ ఓ మీడియా ఫొటోలు విడుదల చేసింది. దేశ వైవిధ్యం, ఏకత్వాన్ని తెలియజేసేలా ప్రత్యేకంగా ఈ జెర్సీని తయారుచేశారు. కాగా, ఏషియన్ గేమ్స్ లో పాల్గొనే భారత మహిళలు, పురుషుల క్రికెట్ జట్లకు బీసీసీఐ బెంగళూరులో క్యాంప్ ఏర్పాటుచేసింది. వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13 నుంచి 16వ తేదీ వరకు విమెన్స్ టీంకు, 12 నుంచి 24వ తేదీ వరకు మెన్స్ టీంకు ట్రైనింగ్ ఉంటుంది.
భారత జట్టు (మెన్స్):
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్)
VIDEO | Indian Olympic Association (IOA) president @PTUshaOfficial and Union Sports minister @ianuragthakur unveil ceremonial dress and player kit for the Indian contingent for #AsianGames, in Delhi. pic.twitter.com/y78lQCUnsk
— Press Trust of India (@PTI_News) September 5, 2023
Indian team jersey for Asian Games. [Sports Today] pic.twitter.com/APUsvRsxV6
— Johns. (@CricCrazyJohns) September 9, 2023