BAN vs NZ: 15 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్పై కివీస్ ఘన విజయం
X
బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ ను న్యూజిలాండ్ ఘనంగా ప్రారంభించింది. తొలి వన్డేలో 86 పరుగులతో విక్టరీ కొట్టింది. బంగ్లాపై కివీస్ ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. వరల్డ్ కప్ కు ముందు జట్టులో పాజిటివ్ ను నింపుకున్నారు. ఇదంతా కామన్ గా అనిపించినా.. కివీస్ కు మాత్రం గొప్ప విషయం. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 15 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ గెలిచింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. బంగ్లాపై కివీస్ 2008లో ఆఖరి వన్డే మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత ఇన్నేళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.2 ఓవర్లలో 254 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 41.1 ఓవర్లలో 168 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. కీవీస్ విజయంలో ఇష్ సోధి కీలకపాత్ర పోషించాడు. 35 రన్స్ చేయడంతో పాటు 6 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు.