Home > క్రీడలు > పాపం న్యూజిలాండ్.. వరుసగా ఐదుసార్లు సెమీస్ చేరినా

పాపం న్యూజిలాండ్.. వరుసగా ఐదుసార్లు సెమీస్ చేరినా

పాపం న్యూజిలాండ్.. వరుసగా ఐదుసార్లు సెమీస్ చేరినా
X

వరల్డ్ కప్ వచ్చిందంటే చాలు.. ఆ జట్లు ఫైనల్ చేరతాయి.. ఈ జట్టు కప్పు గెలుస్తుంది అంటూ సగటు ఫ్యాన్ దగ్గర నుంచి మాజీల వరకూ అందరూ.. విశ్లేషణలు మొదలుపెడతారు. అయితే అలా వినిపించే లిస్ట్ లో న్యూజిలాండ్ పేరు పెద్దగా ఎక్కడా వినిపించదు. కాకపోతే ఒక్కసారి టోర్నీ మొదలయ్యాక వాళ్ల సత్తా బయటకు వస్తుంది. దాంతో అందరి ప్రిడిక్షన్స్ మారిపోతాయి. ఒక్కో మ్యాచ్ గెలుస్తూ టాప్ ఫోర్‌లోకి దూసుకొచ్చి సెమీస్ లో అడుగుపెడతారు. ప్రతీ వరల్డ్ కప్ లో జరిగేది అదే. ఈ ఎడిషన్ లో కూడా కివీస్ ప్రయాణం అలాగే మొదలైంది. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాకిచ్చి.. టోర్నీలో తన జర్నీ స్టార్ట్ చేసింది.

సెమీస్ లో అడుగుపెట్టింది. అయితే ఆ జట్టుకు మాత్రం ఏ వరల్డ్ కప్ కలిసి రావట్లేదు. వరుసగా ఐదు సార్లు సెమీ ఫైనల్ చేరింది. రెండు సార్లు రన్నరప్ గా నిలిచింది. 2007, 2011లో ఆ జట్టు సెమీస్ చేరగా.. 2015, 2019 ఎడిషన్స్ లో ఫైనల్ చేరుకుంది. అయితే ఏ టోర్నీలో అయినా న్యూజిలాండ్ కు నిరాశ తప్పట్లేదు. ఈ వరల్డ్ కప్ లోనూ సెమీస్ చేరిన కివీస్.. టీమిండియా చేతిలో 70 పరుగుల తేడాతో ఓడిపోయింది. టోర్నీ ఏదైనా తమ బెస్ట్ ఇచ్చే కివీస్ సేనకు మాత్రం ప్రతీసారి నిరాశే ఎదురవుతుంది. ప్రపంచ కప్ అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. 2019లో వరల్డ్ కప్ మాత్రం మరీ దారుణం. గెలుపు ముంగిట వరకు వచ్చి ఇంగ్లాండ్ పై అద్భుత పోరాటం చేసింది.

ఆ ఫైనల్ మ్యాచ్ లో రెండు సూపర్ ఓవర్ జరిగాయంటే.. పోటీ ఎంత హోరాహోరీగా జరిగిందో అర్థం చే సుకోవచ్చు. కాగా రెండో సూపర్ ఓవర్ కూడా డ్రా కావడంతో.. బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించారు. కాగా కివీస్ ఓటమిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. కొందరు కివీస్ ఓటమిని అయ్యో పాపం అంటుంటే.. మరికొందరు ‘నల్ల బట్టలు వేసుకోవడం వల్ల శని వాళ్ల చుట్టూ తిరుగుతుంది. అందుకే మ్యాచ్ ఓడిపోతున్నారు’ అంటూ మీమ్స్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా టోర్నీ మొత్తంలో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా.. సెమీస్ లో 70 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తుచేసి ఫైనల్ లోకి అడుగుపెట్టింది.

Updated : 16 Nov 2023 2:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top