Home > క్రీడలు > దంచికొట్టిన న్యూజిలాండ్.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

దంచికొట్టిన న్యూజిలాండ్.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

దంచికొట్టిన న్యూజిలాండ్.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?
X

వరల్డ్ కప్లో భాగంగా కీలక మ్యాచ్లో న్యూజిలాండ్ దుమ్ములేపింది. పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో నిర్ణీత 50ఓవర్లకు 401 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ రెచ్చిపోయి.. పాకిస్తాన్ బౌలర్లను ఊచకోత కోశారు. ఓపెనర్ కాన్వే (35) త్వరగా ఔట్ అయినా.. మరో ఓపెనర్ రచిన్ (108), విలియమ్సన్ (95) ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ భారీ స్కోరుకు పునాదులు వేశారు.

కేన్, రచిన్ వెంట వెంటనే ఔట్ అయినా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు సైతం ధాటిగా ఆడడంతో కివీస్ టోర్నీలోనే భారీ స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో మహ్మద్ వసీం 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ అలీ, ఇఫ్తికర్, రవూఫ్ తలో వికెట్ తీశారు. సెమీస్ చేరాలంటే పాక్ ఈ మ్యాచ్ తప్పక గెలవాలి.


Updated : 4 Nov 2023 4:02 PM IST
Tags:    
Next Story
Share it
Top