Home > క్రీడలు > India vs Newzeland : సెమీస్లో భారత్ vs న్యూజిలాండ్.. కానీ

India vs Newzeland : సెమీస్లో భారత్ vs న్యూజిలాండ్.. కానీ

India vs Newzeland : సెమీస్లో భారత్ vs న్యూజిలాండ్.. కానీ
X

2019 వరల్డ్ కప్ లో జరిగిన దానికి ప్రతీకారం తీసుకునే టైం వచ్చింది. టీమిండియాతో సెమీస్ లో తలపడే జట్టేదో తెలిసిపోయింది. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఘనవిజయం సాధించిన న్యూజిలాండ్ దాదాపు సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. 2019 వరల్డ్ కప్ లో జరిగిన భంగపాటుకు సమాధానం ఇచ్చే రోజిది. నవంబర్ 15న వాంఖడే స్టేడియంలో ఈ సమరం జరుగనుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ దాదాపు సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. అయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కు చాన్స్ లేకపోలేదు. కాకపోతే ఈ రెండు జట్లు భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ అయితే టాస్ ఓడిపోయినా సెమీస్ రేసునుంచి తప్పుకుంటుంది.

ఆఫ్ఘనిస్తాన్ కు మైనస్ రన్ రేట్ కారణంగా మ్యాచ్ గెలిచినా.. భారీ తేడాతో విజయం సాధించకపోతే వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటుంది. అలా న్యూజిలాండ్ లైన్ దాదాపు క్లీయర్ అయిపోయింది. లీగ్ స్టేజ్ లో కివీస్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది టీమిండియా. అయితే సెమీస్ లో కివీస్ ను తక్కువ అంచనా వేయలేం. అంతేకాకుండా గాయం నుంచి కోలుకున్న విలియమ్సన్ టీంలో చేరి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. వరుస ఓటముల్లో ఉన్న కివీస్ కు విజయాలు అందించాడు. లీగ్ స్టేజ్ లో ఆడిన ఎనిమిది మ్యాచుల్లో సూపర్ షో చేసిన భారత్ కు.. సెమీస్ అంత సులువు కాకపోవచ్చు. అయితే అభిమానులు మాత్రం భారత్ విజయం సాధించి ఫైనల్ చేరాలని ఆశిస్తున్నారు.




Updated : 10 Nov 2023 8:31 AM IST
Tags:    
Next Story
Share it
Top