శ్రీలంకను చిత్తు చేసిన న్యూజిలాండ్.. సెమీస్ బెర్త్..
X
సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్ అదరగొట్టింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 5వికెట్ల తేడాతో గెలిచింది. శ్రీలంక 171 రన్స్కే ఆలౌట్ అవ్వగా.. కివీస్ 23.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. డెవాన్ కాన్వే 45, రచిన్ రవీంద్ర 42, డారిల్ మిచెల్ 43 రన్స్తో రాణించారు. లంక బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్ 2,దుష్మంత చమీర 1,దిల్షాన్ మధుశంక ఒక వికెట్ పడగొట్టారు.
అంతుకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంకపై న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగారు. తక్కువ స్కోర్కే లంకను కుప్పకూల్చారు. కివీస్ బౌలర్ల ధాటికి శ్రీలంకగా 46.4 ఓవర్లలో 171 రన్స్కే ఆలౌట్ అయ్యింది. కుశాల్ పెరీరా 51, మహేశ్ తీక్షణ 39 రన్స్తో రాణించగా.. మిగితా బ్యాట్మెన్స్ అందరూ 20లోపే ఔట్ అయ్యారు. ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టగా.. లాకీ ఫెర్గూసన్ 2, మిచెల్ సాంట్నర్ 2, రచిన్ రవీంద్ర 2, టిమ్ సౌథి ఒక వికెట్ తీశారు.