Asian games 2023: నిఖత్ ‘పంచ్’కు.. మరోసారి
X
ఏషియన్ గేమ్స్ లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతుంది. తాజాగా నిఖత్ జరీన్ సంచలన విజయం సాధించింది. మహిళల 50 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి.. సెమీస్ లోకి అడుగుపెట్టింది. దీంతో భారత్ కు మరో పతకం ఖాయం అయింది. జోర్డాన్ బాక్సర్ హనన్ నాసర్ తో జరిగిన క్వార్టర్స్ లో నిఖత్ ఏకపక్షంగా ఆడింది. దూకుడుగా ఆడుతూ.. తొలి రౌండ్ లో కేవలం 53 సెకన్లలోనే గెలిచింది.
దీంతో జోర్డాన్ బాక్సర్ హనన్.. నిఖత్ పంచులకు చేతులెత్తేసింది. ఏకంగా 127 సెకన్లలో మ్యాచ్ ను ముగించి సెమీస్ కు అర్హత సాధించింది. దీంతో 2024లో పారీస్ లో జరిగి ఒలంపిక్స్ కు కూడా నిఖత్ కోటా దక్కించుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఏషియన్ గేమ్స్ లో భారత్ 19 క్రీడల్లో పాల్గొనగా.. 32 పతకాలు దక్కాయి. అందులో 8 స్వర్ణాలు, 12 రజతాలు, 12 కాంస్య పతకాలు ఉన్నాయి. షూటింగ్, రోయింగ్ ఆటల్లో భారత్ ఎక్కువ విజయాలను సాధించింది.