హీరోలు జీరోలయ్యారు.. ఆక్షన్లో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే
X
దుబాయ్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం ప్రారంభమైంది. దేశ, విదేశీ ఆటగాళ్లు ఈ వేలం జాబితాలో ఉన్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు 77 స్లాట్‌లు కోసం పోటీపడుతున్నాయి. ఇందులో 30 వరకు విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు ఉన్నాయి. మొత్తం 333 మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. కాగా 16 సీజన్స్ లో పాల్గొని సత్తా చాటిన స్టార్ ప్లేయర్లకు కూడా ఫ్రాంచేజీలు మొండి చేయి చూపించాయి. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న పలువురు స్టార్ ప్లేయర్లు కూడా వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదు.
ఐపీఎల్ 2024 మినీ వేలంలో భారత క్రికెటర్లకు నిరాశ తప్పడం లేదు. ఆర్సీబీ, సన్ రైజర్స్, ఢిల్లీ, పంజాబ్ జట్ల తరుపున 16 ఐపీఎల్ సీజన్స్ లో పాల్గొన్న మనీష్ పాండే అన్ సోల్డ్ లిస్ట్ లో చేరిపోయాడు. కరుణ్ నాయర్ ను కూడా ఏ జట్టు కొనుగోలు చేయలేదు. మనీష్ పాండే, కరుణ్ నాయర్ లను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దీంతో అన్‌సోల్డ్ ఆటగాళ్లుగా మిగిలిపోయారు.
గతంలో రాజస్థాన్, పూణే జట్లకు కెప్టెన్ గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్ కు నిరాశ తప్పలేదు. వరుసగా రెండో సీజన్ లో కూడా స్మిత్ ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ తో ఆక్షన్ కు వచ్చిన స్మిత్, సౌతాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రైలీ రూసోలోను కొనుగోలు చేయడానికి ఏ జట్టు ముందుకు రాలేదు. దీంతో వీరు కూడా అన్ సోల్డ్ ప్లేయర్ల లిస్ట్ లో చేరిపోయాడు.