Home > క్రీడలు > Shubman Gill: ‘జట్టులో నుంచి తీసేయండి’.. గిల్ ప్లేస్ గోవిందా..!: మాజీల విమర్శలు

Shubman Gill: ‘జట్టులో నుంచి తీసేయండి’.. గిల్ ప్లేస్ గోవిందా..!: మాజీల విమర్శలు

Shubman Gill: ‘జట్టులో నుంచి తీసేయండి’.. గిల్ ప్లేస్ గోవిందా..!: మాజీల విమర్శలు
X

టీమిండియా ఫ్యూచర్ జనరేషన్ బ్యాటర్ శుభ్మన్ గిల్పై దిగ్గజాలు, క్రికెట్ ఎక్స్ పర్ట్స్, టీమిండియా అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ‘శుభ్మన్ గిల్ను జట్టులో నుంచి తీసేయండి’.. ‘గిల్ టెస్టులకు పనికారాడు’.. ‘ఎలా ఆడాలో నేర్చుకో గిల్‌’.. ‘గిల్ ప్లేస్ గోవిందా’.. ‘ఈ చెత్త ప్రదర్శన ఇంకెనన్నాళ్లు’.. అంటూ ఫైర్ అవుతున్నారు. దీనికి కారణం గిల్ వరుసగా టెస్ క్రికెట్ లో ఫెయిల్ అవ్వడమే. వన్డేలు, టీ20ల్లో రాణించడం.. టెస్టుల్లో అతని స్థానానికి పెద్దగా పోటీ లేకపోవడంతో టెస్టుల్లో ఫెయిల్ అవుతున్నా బీసీసీఐ అవకాశాలు ఇస్తుందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే.. గిల్ గత 10 టెస్టు మ్యాచులు చూసుకుంటే.. అతను సాధించిన పరుగులు దారుణంగా ఉన్నాయి. ఆ 10 ఇన్నింగ్స్ లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు.

చివరి 8 ఇన్నింగ్స్‌లలో గిల్‌ స్కోర్లు 6, 1, 29*, 2, 26 36, 10, 23 పరుగులు మాత్రమే చేశాడు. అవకాశాలు ఇస్తున్నా సద్వినియోగం చేసుకోవట్లేదని మాజీల వాదన. కనీసం స్వదేశంలో ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరగుతున్న టెస్టులో అయినా రాణిస్తాడనుకుంటే.. తొలి ఇన్నింగ్స్ లో 23 పరుగులే చేశాడు. ఓ చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. దీంతో గిల్ పై విమర్శలు పెరిగాయి. జట్టులో ఇంకా కొత్త కుర్రాళ్లు ఉన్నారు. వారికి అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అటు అనిల్ కుంబ్లే, సునీల్ గవాస్కర్ కూడా గిల్ ఆటతీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. 3 నెంబర్ బ్యాటర్ గా జట్టును నడిపించే బాధ్యత ఉంటుందని, పెద్ద భారాన్ని భుజాలపై మోయాలని చెప్తున్నారు. కాగా గిల్ కు ఆ క్వాలిటీలు లేవని, ఇంకా ఆడటం నేర్చుకోవాలని పెదవి విరుస్తున్నారు. ద్రవిడ్, పుజారా, కోహ్లీలా రాణించాలంటే.. స్ట్రైక్ రొటేట్ చేయాలని, కానీ బాధ్యత లేకుండా చెత్త షాట్లు ఆడి గిల్ వికెట్ పారేసుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. దీంతో గిల్‌ ప్లేస్‌కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రెండో ఇన్నింగ్స్ లోనూ ఫెయిల్ అయితే.. రజత్ పటిదార్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

Updated : 27 Jan 2024 8:52 AM IST
Tags:    
Next Story
Share it
Top