Home > క్రీడలు > వింబుల్డన్ క్వార్టర్స్ లో అడుగుపెట్టిన జకోవిచ్

వింబుల్డన్ క్వార్టర్స్ లో అడుగుపెట్టిన జకోవిచ్

వింబుల్డన్ క్వార్టర్స్ లో అడుగుపెట్టిన జకోవిచ్
X

వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లో ఎప్పటిలాగే సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ దూసుకుపోతున్నాడు. 14వసారి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు.

అలుపన్నది లేకుండా టైటిల్స్ కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు జొకోవిచ్. ఇప్పటివరకు 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను గెలుచుకున్న జొకోవిచ్ 24వ టైటిల్ ను కూడా సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. వింబుల్డన్ టోర్నీలో 2021త పెమీ ఫైనలిస్ట్ ముబెర్ట్ హుర్కాజ్ మీద 7-6, 7-6, 5-7, 6-4తో గెలిచి క్వార్టర్స్ లోకి అడుగుపెట్టాడు.





తన లక్ష్యం చేరుకోవడానికి ఏం చేయడానికి అయినా...ఎలా ఆడ్డానికి అయినా సిద్ధపడిపోతున్నాడు. అందుకు ఉదాహరణే...హుర్కాజ్ తో జరిగిన మ్యాచ్ లో జకోవిచ్ అటెంప్ట్ చేసిన ఒక షాట్. మ్యాచ్ లో హుర్కాజ్ సర్వీస్ చేశాక డ్రాప్ షాట్ కొట్టాడు. అది నెట్ కు దగ్గరలో బంతి పడేలా కనిపించింది. ఒక్క పాయింట్ కూడా వదిలేది లేదన్నట్టు కనిపించిన జొకోవిచ్ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి ఆ బాల్ ను అటెంప్ట్ చేశాడు. దీంతో అతను బ్యాలెన్స్ కోల్పోయి నెట్ మీద పడిపోయాడు. జకోవిచ్ కు దెబ్బలు ఏమీ తగల్లేదు కానీ ఆటమీద అతనికున్న పట్టుదల, కమిట్ మెంట్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జకోవిచ్ కు ఇది సరిగ్గా వందో వింబుల్డన్ మ్యాచ్.





మామూలుగా టెన్నిస్ మ్యాచ్ కొన్ని గంటల్లో అయిపోతుంది. కానీ జకోవిచ్, హుర్కాజ్ కు జరిగిన మ్యాచ్ మాత్రం రెండు రోజులు జరిగింది. టోర్నీ రూల్స్ ప్రకారం రాత్రి 11 గంటలకు వరకు ఆడాలి. కానీ మ్యాచ్ లో రెండు సెట్ లు ముగిసేసరికే 11 గంటలు అయిపోయింది. దీంతో మ్యాచ్ ఆపేసి మూడు, నాలుగు సెట్ లను మర్నాడు ఆడించారు. మొదటి రెండు సెట్ లు జకోవిచ్ గెలవగా, మూ సెట్ మాత్రం హుర్కాజ్ గెలిచాడు. మళ్ళీ నాలుగో సెట్ ను జకోవిచ్ గెలుచుకున్నాడు. దీంతో మ్యాచ్ అతని సొంతం అయింది. వింబుల్డన్ లో జకోవిచ్ ఆడిన వంద మ్యాచ్ లలో అతను 90 విజయాలను నమోదు చేసుకున్నాడు.



Updated : 11 July 2023 10:41 AM IST
Tags:    
Next Story
Share it
Top