Home > క్రీడలు > World Cup 2023: ప్రపంచకప్‌ వేటకు భారత్ సిద్ధం.. ఆస్ట్రేలియాతో అమీతుమీ

World Cup 2023: ప్రపంచకప్‌ వేటకు భారత్ సిద్ధం.. ఆస్ట్రేలియాతో అమీతుమీ

World Cup 2023: ప్రపంచకప్‌ వేటకు భారత్ సిద్ధం.. ఆస్ట్రేలియాతో అమీతుమీ
X

సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ వేటను మొదలుపెట్టేందుకు టీమిండియా సిద్ధమైంది. విశ్వటోర్నీ గెలువడమే లక్ష్యంగా కదనరంగంలోకి దిగేందుకు రెడీ అయింది. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా భారత్ నేడు (ఆదివారం , అక్టోబర్ 8) చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‍తోనే మెగాటోర్నీలో పోరును షురూ చేయనుంది. తొలి మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీతో టోర్నీని ప్రారంభించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. విశ్వటోర్నీకి ముందు ఆసీస్‍తో జరిగిన వన్డే సిరీస్‍ను టీమిండియా కైవసం చేసుకుంది. అయితే, ఆఖరి మ్యాచ్‍లో ఆసీస్ పుంజుకుంది. ఇరు జట్లు వన్డే ప్రపంచకప్‍లోకి ఆత్మవిశ్వాసంతో అడుగుపెడుతున్నాయి. రెండు బలమైన జట్ల మధ్య జరిగే ఇంట్రెస్టింగ్ మ్యాచ్(IND vs AUS World Cup) కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అంతకు అర గంట ముందు టాస్ పడుతుంది. అయితే ప్రపంచకప్‌లో భాగంగా భారత్ ఆడాల్సిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో ఒక్క వామప్ మ్యాచ్ కూడా ఆడకుండానే రోహిత్ సేన బరిలోకి దిగుతోంది. జట్టులో సూపర్‌ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌కు డెంగ్యూ వచ్చినట్టు తెలుస్తోంది. అతడు ఈ మ్యాచ్ ఆడతాడా లేదా అనేది అనుమానంగా ఉంది. గిల్ అందుబాటులోకి రాకపోతే ఇషాన్‌కిషన్‌ని ఓపెనింగ్ దింపే ఆలోచనలో ఉంది బీసీసీఐ. ఇక మరో కీలక ప్లేయర్ హార్దిక్ పాండ్యా కూడా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రాక్టీస్ సెషన్‌లో సిరాజ్ వేసిన ఓ బంతిని ఎదుర్కొనే క్రమంలో వైస్ కెప్టెన్ పాండ్యా వేలికి గాయమైనట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. డీడీ స్పోర్ట్స్ చానెల్‍లోనూ లైవ్ వస్తుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ యాప్, వెబ్‍సైట్‍లోనూ ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

టీమ్ ఇండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ మరియు మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా జట్టు:

పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, షాన్ అబాట్, మార్నస్ లాబుషాగ్నే, కెమెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ .

Updated : 8 Oct 2023 8:41 AM IST
Tags:    
Next Story
Share it
Top