Home > క్రీడలు > డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్గా సంజయ్ సింగ్.. రెజ్లింగ్కు సాక్షి గుడ్ బై

డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్గా సంజయ్ సింగ్.. రెజ్లింగ్కు సాక్షి గుడ్ బై

డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్గా సంజయ్ సింగ్.. రెజ్లింగ్కు సాక్షి గుడ్ బై
X

భారత మహిళా రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ సంచలన ప్రకటన చేసింది. రెజ్లింగ్కు వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించింది. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అనుచరుడి నేతృత్వంలో తాను పోటీల్లో పాల్గొనలేనని.. అంతకన్నా ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించడమే మేలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో సాక్షి మాలిక్, వినేశ్‌ ఫొగట్‌ తదితర మహిళా రెజ్లర్లు గతంలో నిరసన చేపట్టారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దాదాపు 40 రోజుల పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రెజ్లింగ్ ఫెడరేషఖన్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగాయి. అందులో బ్రిజ్‌ భూషణ్‌ వీర విధేయుడిగా పేరున్న సంజయ్‌ కుమార్‌ సింగ్‌ మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలిచిన మాజీ రెజ్లర్‌ అనితా షెరాన్‌పై విజయం సాధించాడు.

గురువారం నిర్వహించిన రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 47 ఓట్లకుగానూ సంజయ్ కుమార్ సింగ్ కు 40 ఓట్లు వచ్చాయి. కామన్‌వెల్త్‌ బంగారు పతక విజేత, రెజ్లర్‌ అనితా షెరాన్ కు కేవలం 7 ఓట్లు మాత్రమే పడ్డాయి. డబ్ల్యూఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగానూ పనిచేసిన సంజయ్‌ సింగ్.. ఉత్తర్‌ ప్రదేశ్‌ రెజ్లింగ్‌ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.



Updated : 21 Dec 2023 1:46 PM GMT
Tags:    
Next Story
Share it
Top