Virat Kohli 35th Birthday: ఈసారి ఇంకాస్త స్పెషల్గా కోహ్లీ బర్త్డే సెలబ్రేషన్స్
X
టీమిండియా సేవియర్, రన్ మెషిన్, చేస్ మాస్టర్ విరాట్ కోహ్లీ అంటే అందరికీ చాలా స్పెషల్. కేవలం కోహ్లీ కోసమే మ్యాచ్ చేసే వాళ్లు చాలామందే ఉంటారు. అతనికి సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటిది మరో ఐదు రోజుల్లో కింగ్ కోహ్లీ బర్త్ డే.. ఆ రోజే భారత్, సౌతాఫ్రికా బిగ్ ఫైట్.. పైగా వరల్డ్ కప్. ఇక అభిమానుల్లో ఇంకెంత హైప్ ఉండాలి. కాగా నవంబర్ 5న జరిగే ఈ మ్యాచ్.. ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ లో (కోల్ కతా) జరుగుతుంది. ఈ సందర్భంగా కోహ్లీ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది.
స్టేడియంలో మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చే అభిమానులకు (70 వేల మంది) ఫ్రీగా కోహ్లీ ఫేస్ మాస్క్ లను అందించనుంది. దీంతో ఆ రోజు స్టేడియం మొత్తం కోహ్లీ బొమ్మలతో కనువిందు చేయనుంది. అంతేకాకుండా మ్యాచ్ కు ముందు స్టేడియంలో కోహ్లీతో కేక్ కట్ చేయించి.. ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకుంది. కాగా తమ ప్లాన్స్ కు సంబంధించి ఐసీసీకి అప్రూల్ కూడా పెట్టారు. తమ అప్రూవల్ ను ఐసీసీ అనుమతిస్తుందని క్యాబ్ ప్రెసిడెంట్ స్నేహశీష్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.