Home > క్రీడలు > తొలి టెస్ట్లో సెంచరీల మోత.. సత్తా చాటిన రోహిత్, జైశ్వాల్

తొలి టెస్ట్లో సెంచరీల మోత.. సత్తా చాటిన రోహిత్, జైశ్వాల్

తొలి టెస్ట్లో సెంచరీల మోత.. సత్తా చాటిన రోహిత్, జైశ్వాల్
X

వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా ఓపెనర్లు సత్తాచాటారు. విండీస్ బౌలర్లను ఎదుర్కొని సెంచరీలతో కదం తొక్కారు. కెప్టెన్ రోహిత్ శర్మ (103, 221 బంతుల్లో), అరంగేట్ర ఆటగాడు యశస్వీ జైశ్వాల్ (143 బ్యాటింగ్, 350 బంతుల్లో) సెంచరీలు బాదడంతో.. టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొదటి టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి భారత్ 312 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (36) జైశ్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 162 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఓవర్ నైట్ స్కోర్ (మొదటి రోజు) 80/0తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. మొదటి సెషన్ ను కాస్త నెమ్మదిగా ఆడింది. విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. దూకుడు తగ్గించి డిఫెన్స్ కు దిగారు. సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశారు. లంచ్ బ్రేక్ ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. 220 బంతుల్లో టెస్టుల్లో పదో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ.. తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. అథనేజ్ బౌలింగ్ లో ద సిల్వాకు క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన శుభ్ మన్ గిల్ (6) కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలువ లేకపోయాడు. దాంతో భారత్ 245 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. తర్వాత వచ్చిన విరాట్ తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు జైశ్వాల్.



Updated : 14 July 2023 5:10 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top