Home > క్రీడలు > ICC WORLD CUP 2023 : భారత్ను ఓడిస్తే.. మీతో డేట్కు వస్తా: పాకిస్తాన్ నటి

ICC WORLD CUP 2023 : భారత్ను ఓడిస్తే.. మీతో డేట్కు వస్తా: పాకిస్తాన్ నటి

ICC WORLD CUP 2023 : భారత్ను ఓడిస్తే.. మీతో డేట్కు వస్తా: పాకిస్తాన్ నటి
X

ప్రపంచ కప్ లో దయాదుల పోరు జరగడం కామన్.. ఆ మ్యాచ్ కోసం అభిమానులు ఎదురుచూడటం కామన్.. అందులో పాకిస్తాన్ ఓడిపోవడం కామన్.. మనపై వాళ్ల ఏడుపు కామన్.. ఇదంతా రోటీన్ అయిపోయింది. ఈ వరల్డ్ కప్ లో అయితే.. పాకిస్తాన్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ఘన విజయం సాధించింది. దీన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తర్వాత మ్యాచుల్లో భారత్ ఓడిపోవాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాక్ నటి సెహర్ షిన్వారి సంచలన ప్రకటన చేసింది. రేపు జరిగే మ్యాచ్ లో బంగ్లాదేశ్.. టీమిండియాను ఓడిస్తే.. బంగ్లా ఆటగాళ్లతో డేట్ కు వస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.





‘దేవుడా.. భారత్ ను బంగ్లాదేశ్ ఓడిస్తే.. ఆ దేశ క్రికెటర్ తో డిన్నర్ డేట్ కు వెళ్తా’ అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. అయితే ఇలాంటి వివాదాస్పద పోస్టులు పెట్టడం సెహర్ కు కొత్తేంకాదు. ఆసియాకప్ 2023 సూపర్ 4 మ్యాచ్ అప్పుడు కూడా ఇలానే చేసింది. ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోగా.. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం, మిగతా ప్లేయర్స్ పై పోలీస్ కేసు పెడతానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పాకిస్తాన్ ఆటగాళ్లు క్రికెట్ ఆడటానికి బదులు.. పాక్ ప్రజల మనోభావలతో ఆడుకుంటున్నారని ఆరోపించింది.




Updated : 18 Oct 2023 6:01 PM IST
Tags:    
Next Story
Share it
Top