IND vs PAK: జడేజా బంతికి.. ముఖం పగిలింది. తర్వాత మ్యాచ్కు డౌటే?
X
రెండు రోజుల నిరీక్షణకు తెరదించుతూ సూపర్ 4లో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. కేవలం 32 ఓవర్లలో 128 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 228 పరుగుల భారీ విజయం దక్కింది. 357 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించడంలో పాక్ తేలిపోయింది. చాలా రోజుల తర్వాత టీమిండియా పూర్తి స్థాయి ప్రదర్శన చూసిన ఫ్యాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారు. నిన్నటి మ్యాచ్ లో పాక్ అభిమానుల గుండెలు అధిరిపోయే ఘటన జరిగింది. జడేజా బౌలింగ్ లో పాక్ బ్యాటర్ సల్మాన్ తీవ్రంగా గాయపడ్డారు. 21 ఓవర్ లో జడేజా బౌలింగ్ లో సల్మాన్ హెల్మెట్ లేకుండా బ్యాటింగ్ చేశాడు.
స్పిన్నరే కదా నన్నేం చేస్తాడు? తేలిగ్గా సిక్సర్లు, ఫోర్లు బాదేస్తా అనుకున్నాడో ఏమో? అదే అతను చేసిన తప్పయింది. తర్వాత మ్యాచ్ అడతాడో లేదో అన్న పరిస్థితి నెలకొంది. జడేజా వేసిన బంతిని సల్మాన్ స్వీప్ షాట్ ఆడగా.. అది మిస్ అయి కుడి కన్ను కింద బలంగా తగిలింది. రక్తం కూడా రావడంతో సల్మాన్ నొప్పితో విలవిల్లాడు. తర్వాత ఫిజియే వచ్చి ట్రీట్మెంట్ చేయగా.. బ్యాటింగ్ ను కొనసాగించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సల్మాన్ కు గాయం అయిన టైంలో కేఎల్ రాహుల్ వేగంగా స్పందించాడు. దీనికి ఫిదా అయిన పాక్ ఫ్యాన్స్ రాహుల్ ను తెగ పొగుడుతున్నారు.