Home > క్రీడలు > పాకిస్తాన్ జర్నలిస్ట్ నోటి దురుసు.. మనోళ్లపై ఏడుస్తూ ట్వీట్లు

పాకిస్తాన్ జర్నలిస్ట్ నోటి దురుసు.. మనోళ్లపై ఏడుస్తూ ట్వీట్లు

పాకిస్తాన్ జర్నలిస్ట్ నోటి దురుసు.. మనోళ్లపై ఏడుస్తూ ట్వీట్లు
X

క్రికెట్ లో విరాట్ కోహ్లీకున్న క్రేజ్ చూసి ప్రపంచమంతా కుళ్లుకుంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో ముందు వరుసలో ఉండేది పాకిస్తాన్ అనడంలో అతిశయోక్తి లేదు. కోహ్లీ అనే కాదు టీమిండియా ఆటగాళ్లపై, బీసీసీఐ విషయంలో ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ పెట్టుకుంటుంటారు. కోహ్లీ ఫామ్ లో లేకపోయినా, సెంచరీ చేయకపోయినా.. వాళ్ల ఇబ్బంది పడుతుంటారు. ఉచిత సలహాలిస్తూ.. విమర్శలకు గురవుతుంటారు. ఈ క్రమంలో మరో ముచ్చట చర్చలోకి వచ్చింది. క్రిక్ డెన్ ఫౌండర్, పాక్ జర్నలిస్ట్ ఫరీద్ ఖాన్.. కోహ్లీ, బీసీసీఐపై విమర్శిస్తూ చేసిన ట్వీట్ వార్తల్లో నిలిచింది.

విరాట్ కోహ్లీపై కుట్ర జరుగుతోందని, అతన్ని టీం నుంచి తప్పించేందుకే బెంచ్ పై కూర్చోపెడుతున్నారని ట్వీట్ చేశాడు. దీనికి అతను ఇస్తున్న వివరణ ఏంటంటే.. వెస్టిండీస్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ కు కోహ్లీని ఎంపిక చేసినప్పటికీ.. ఒక మ్యాచ్ లో ఆడిపించి రెండు మ్యాచుల్లో బెంచ్ కే పరిమితం చేశారు. విశ్రాంతి పేరుతో బెంచ్ కు పరిమితం చేసి.. చివరికి ఒత్తిడి పెంచి రిటైర్ అయ్యేలా చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. అంతేకాకుండా.. సచిన్ 49 వన్డే సెంచరీల రికార్డ్ ను కోహ్లీ బ్రేక్ చేయకుండా ఆపుతున్నారని, ప్రస్తుతం 46 సెంచీలతో ఉన్న విరాట్ ఎక్కడ ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తాడనే భయం బీసీసీఐకి పట్టుకుందని అన్నాడు.

ఒకఆటగాడి విజయంలో చేయందించాలంటే.. అతనికి అవకాశాలు ఇవ్వాలని, రికార్డులు క్రియేట్ చేసేలా సపోర్ట్ చేయాలని అన్నాడు. అయితే, ఆ ట్వీట్లకు రిప్లై ఇస్తున్న భారత అభిమానులు ఫరిద్ పై మండి పడుతున్నారు. కుర్రాళ్లకు అవకాశాలందించడం కోసం సీనియర్లను పక్కడ పెడిత.. దాన్ని రాజకీయం చేసి చర్చకు దారి తీస్తున్నాడని ఫైర్ అయ్యారు. చెత్త వాగుడు మానుకుని పాక్ క్రికెట్ బోర్డ్, ప్లేయర్ల అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు.




Updated : 2 Aug 2023 9:27 PM IST
Tags:    
Next Story
Share it
Top