PAK vs BAN : బంగ్లాదేశ్పై పాకిస్థాన్ ఘన విజయం
X
4 పరాభవాల తర్వాత పాక్ విజయం
వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించింది. నాలుగు పరాజయాల తర్వాత ఎట్టకేలకూ విజయం నమోదుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా టీంను 204 పరుగులకే కట్టడి చేసిన పాక్ ఆటగాళ్లు.. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా చేధించారు. ఈ గెలుపుతో పాక్ వరుస ఓటములకు బ్రేక్ వేయడమే కాకుండా.. పాయింట్ల పట్టికలో అఫ్గానిస్తాన్‌ను వెనక్కినెట్టి ఐదో స్థానానికి చేరింది.
బంగ్లాదేశ్ ఇచ్చిన 204 పరుగుల లక్ష్యాన్ని పాక్ మరో 105 బంతులు మిగిలివుండగానే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఫకర్ జమాన్ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫకర్ జమాన్ 81 (74 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులు), అబ్దుల్లా షఫీక్ 68 (69 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులు)లు హాఫ్ సెంచరీలు చేశారు. ఓపెనర్లిద్దరూ కలిసి 128 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బాబర్ అజామ్ (9) విఫలమైనప్పటికీ.. మిడిలార్డర్‌లో వచ్చిన మహ్మద్ రిజ్వాన్ (26*), ఇఫ్తికర్ అహ్మద్ (17*) టార్గెట్ పూర్తి చేశారు. మూడు వికెట్లు మిరాజ్‌కే దక్కడం విశేషం.
అంతకుముందు పాక్ పేసర్లు షాహిన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్, వసీం జూనియర్ చెలరేగడంతో బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా56 (70 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్) టాప్ స్కోరర్ గా నిలవగా.. లిట్టన్ దాస్(45), షకిబ్ అల్ హసన్ (43) రన్స్ చేశాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్ చెరో మూడు వికెట్లు తీసుకోగా.. హారిస్ రౌఫ్ 2, ఇఫ్తికార్ అహ్మద్, ఉసామా మీర్ చెరో వికెట్ పడగొట్టారు.