Pakistan Captain Babar Azam: బాబర్ అజామ్ ప్రైవేట్ చాట్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్
X
భారీ అంచనాలతో వరల్డ్ కప్ బరిలోకి దిగిన పాకిస్తాన్.. దారుణంగా ఫెయిల్ అవుతుంది. ఇప్పటి వరకు 6 మ్యాచులు ఆడితే కేవలం 2 మ్యాచుల్లోనే విజయం సాధించింది. పాయింట్స్ టేబుల్ లో 6వ స్థానంలో నిలిచింది. చిన్న జట్ల చేతిలో కూడా దారుణంగా ఓడిపోతుంది. అన్ని విభాగాల్లో ఫెయిల్ అయి ఓటముల్ని మూటగట్టుకుంటుంది. ప్రస్తుతం పరిస్థితులను బట్టి పాక్ సెమీస్ ఆశలు సన్నగిళ్లాయి. మిగిలిన 3 మ్యాచుల్లో గెలిస్తే తప్ప సెమీస్ ఆశలు దాదాపు లేనట్లే. దీంతో పాక్ మీడియాతో పాటు.. అభిమానులు, మాజీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బాబర్ ఆజం కెప్టెన్సీ వల్లే పాక్ ఓడిపోతుందని ఆరోపిస్తున్నారు. బాబర్ కెప్టెన్ గా, ప్లేయర్ గా ఫెయిల్ అయ్యాడని దుయ్యబట్టారు. దీంతో అతనిపై వేటు పడే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో బాబర్ ఆజం కొత్త సమస్యలో ఇరుకున్నాడు. బాబర్ చేసిన ప్రైవేట్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై పాక్ క్రికెట్ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
ఈ విషయంపై బాబర్ ఆజం పాక్ క్రికెట్ బోర్డ్ చీఫ్ జకా అష్రఫ్ తో మాట్లాడేందుకు ప్రయత్నం చేసినా.. అతని నిరాకరించాడని మాజీ కెప్టెన్ లతీఫ్ రషీద్ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో బాబర్, పాక్ బోర్డ్ ఆసరేటింగ్ అధికారి సల్మాన్ నసీర్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ చాట్ ను పాక్ బోర్డ్ చీఫ్ జకా అష్రఫ్ లీక్ చేశాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా దీనిపై పాక్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘బాబర్ పాకిస్తాన్ టీంకు విలువైన ఆస్తి. దయచేసి అతన్ని వదిలేయండి. తప్పుడు ప్రచాయంతో రూమర్స్ స్ప్రెడ్ చేయకండి’ అంటూ మండిపడ్డాడు.