Home > క్రీడలు > Pakistan cricket players: పాక్‌ ఆటగాళ్లకు జ్వరాలు.. ఎల్లుండి ఆస్ట్రేలియాతో..

Pakistan cricket players: పాక్‌ ఆటగాళ్లకు జ్వరాలు.. ఎల్లుండి ఆస్ట్రేలియాతో..

Pakistan cricket players: పాక్‌ ఆటగాళ్లకు జ్వరాలు.. ఎల్లుండి ఆస్ట్రేలియాతో..
X

పాకిస్తాన్ టీంను కష్టాలు వెంటాడుతున్నాయి. శుక్రవారం ఆస్ట్రేలియతో ఆ టీం తలపడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుండగా.. పాక్ జట్టు అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో టీంలోని పలువురు ఆటగాళ్లు జ్వరాలు బారిన పడ్డారు. ప్రస్తుతం వారు డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇప్పటికీ కొందరు కోలుకోగా.. మరికొందరు ఇంకా చికిత్స తీసుకుంటున్నారు.

కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌, స్టార్‌ పేసర్‌ షహీన్‌షా అఫ్రిది ఆరోగ్యంగానే ఉన్నారు. మంగళవారం జట్టు సభ్యులు చిన్నస్వామి స్టేడియంలో కొద్దిసేపు ప్రాక్టీస్ చేశారు. ఫస్ట్ రెండు మ్యాచుల్లో గెలిచి ఊపుమీదున్న పాక్కు మూడో మ్యాచులో భారత్ గట్టి షాకిచ్చింది. ఆ మ్యాచులో 191 రన్స్కే పాక్ కుప్పకూలగా.. 32ఓవర్లలోనే భారత్ 192 టార్గెట్ను చేధించింది. ఈ మ్యాచ్తో గట్టి ఝలక్ తిన్న పాక్ టీంను జ్వరాలు చుట్టుముట్టడం గమనార్హం.

Updated : 18 Oct 2023 10:00 AM IST
Tags:    
Next Story
Share it
Top