పాకిస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్.. ఫైనల్లో భారత్ ఓటమికి కారణం అదేనా..?
X
ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఏ జట్టు ఓటమి పాలైంది. ఫైనల్ లో పాకిస్తాన్ ఏ జట్టు భారత్ ఏపై 128 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో పాక్ వరుసగా రెండోసారి ఎమర్జింగ్ ప్లేయర్ ఏషియాకప్ ను సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది. 353 పరుగుల భారీ లక్ష్య చేదనతో భరిలోకి దిగిన భారత్.. 40 ఓవర్లలోనే కుప్పకూలింది. 224 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (29), అభిశేక్ శర్మ (61) శుభారంభాన్ని ఇచ్చినా.. మిగతా బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. కెప్టెన్ యష్ ధూల్ (39) క్రీజులో ఉన్న టైంలో భారత్ 157/3తో మంచి స్థితిలోనే కనిపించింది. కానీ, తర్వాత వికెట్లు వెంట వెంటనే పడిపోవడంతో 67 పరుగుల వ్యవధిలో మిగతా 7 వికెట్లు కోల్పోయింది. పాక్ బౌలర్లలో సుఫియాన్ ముఖీమ్ 3, అర్షద్ ఇక్బాల్, మెహ్రాన్ ముంతాజ్, మహ్మద్ వసీం చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఫైనల్ లో ఫిక్సింగ్:
ఫైనల్ లో భారత్ ఓటమికి కారణం పాక్ ఫిక్సింగ్ కు పాల్పడిందని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఫైనల్ లో భారత్ బ్యాటింగ్ టైంలో కొన్ని సంఘటనలు ఫిక్సింగ్ చేసినట్లు అనిపిస్తున్నాయి. దాంతో ఈ మ్యాచ్లో పాక్ ఆటగాళ్లు, అంపైర్లతో కుమ్మక్కై ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. మ్యాచ్ జరుగుతున్న టైంలో ఓ పాక్ ఆటగాడు.. ఆఫ్ ఫీల్డ్ అంపైర్ తో మాట్లాడుతూ కనిపించాడు. అంతేకాకుండా నికిన్ జోస్ ఔట్ అయిన విధానం కూడా చర్చల్లో నిలిచింది. అల్ట్రా ఎడ్జ్ లో ఎలాంటి స్పైక్ కనిపించకపోయినా.. థర్డ్ అంపైర్ నికిన్ జోస్ ను ఔటిచ్చారని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ రెండు కారణాలతో ఫైనల్ మ్యాచ్ లో పాక్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు అనుమానాలు బలపడుతున్నాయి.