Home > క్రీడలు > Abdul Razzaq :ఐశ్వర్యా రాయ్‌పై పాక్ మాజీ క్రికెటర్ గలీజ్ కూతలు

Abdul Razzaq :ఐశ్వర్యా రాయ్‌పై పాక్ మాజీ క్రికెటర్ గలీజ్ కూతలు

Abdul Razzaq :ఐశ్వర్యా రాయ్‌పై పాక్ మాజీ క్రికెటర్ గలీజ్ కూతలు
X

ఆడ లేక మద్దెల ఓడు అన్నట్టుంది పాక్ క్రికెట్ ముఠా తీరు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో దారుణంగా ఆడి పరువు పోగొట్టుకున్న పాక్ జట్టు పోస్ట్ మార్టం చేసుకుంటోంది. ఆటగాళ్లకు, అభిమానులకే కాకుండా మాజీ క్రికెట‌ర్లకు కూడా ఓటమి ఏమాత్రం మింగుడుపడడం లేదు. జట్టు పనితీరు మెరుగుపడాలని అందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు. మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ పాక్ జట్టుకు సుద్దులు చెబుతూ అనవసరంగా మాట తూలాడు. బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్యా రాయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓ చర్చలో మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, మిస్బా ఉల్ హక్, సల్మాన్ బట్‌ల‌తో కలసి మాట్లాడిన రజాక్ పురుషాధిపత్యాన్ని చాటుకుంటూ ఐశ్వర్యపై చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ తారలు మండిపడుతున్నారు.

‘‘జట్టులో చిత్త‌శుద్ధి, అంకిత‌భావం లేకపోతే ఇలాగే జరుగుతుంది. నేను ఐశ్వ‌ర్య‌రాయ్‌ను పెళ్లి చేసుకుంటే అంద‌మైన, మంచి పిల్ల‌లు పుడ‌తారనుకుంటాను.. అది జరిగే పని కాదు. పాక్ క్రికెట్ బోర్డులో సమూల ప్రక్షాళన చేయాలి. మన జట్టులో ఆత్మవిశ్వాసం పోయింది. కెప్టెన్ జ‌ట్టుకు స్ఫూర్తినివ్వాలి. నేను ఆడేటప్పుడు మా కెప్టెన్ యూనిస్ ఖాన్ నన్ను బాగా ప్రోత్సహించేవాడు. అతని సలహాలు పాటించి బాగే ఆడేవాడిని. ఇప్పుడు మన జట్టులో అలాంటి వాతావ‌ర‌ణం లేదు’’ అని రజాన్ అన్నారు. ఆట గురించి మాట్లాడుతూ మధ్యలో ఐశ్వర్యా రాయ్ గురించి అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడమేంటని బాలీవుడ్ అభిమానులు మండిపడుతున్నారు. పాక్ మాజీ క్రికెటర్లను భారతీయులను ఏదో ఒకటి అనడం మామూలైపోయింది, అంత ఘోరంగా ఓడినా బుద్ధి రావడం లేదని అంటున్నారు. ‘అబ్దుర్ రజాక్ కంటే ఐశ్వర్య రాయ్ కారు డ్రైవర్ చాలా అందంగా ఉంటాడు’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘‘ఇస్లాం ఆడవాళ్ల గురించి ఇలా మాట్లాడమంటుందా? అతనిక చదువులు సంధ్యలు లేవా?’ అని మరొకరు ప్రశ్నించారు.


Updated : 14 Nov 2023 7:01 PM IST
Tags:    
Next Story
Share it
Top