Home > క్రీడలు > వరల్డ్కప్కు పాక్ ఆటగాళ్ల వెంట సైకాలజిస్ట్లు.. ఎందుకొస్తున్నారంటే..

వరల్డ్కప్కు పాక్ ఆటగాళ్ల వెంట సైకాలజిస్ట్లు.. ఎందుకొస్తున్నారంటే..

వరల్డ్కప్కు పాక్ ఆటగాళ్ల వెంట సైకాలజిస్ట్లు.. ఎందుకొస్తున్నారంటే..
X

వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్తాన్ పాల్గొంటుందా లేదా అన్న ప్రశ్నకు తెర పడింది. గత కొంతకాలంగా వస్తున్న వార్తలకు తెరదించుతూ.. భారత పర్యటనకు పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ కు వచ్చేందుకు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. మొదట పాక్ లో జరిగే ఆసియా కప్ కు భారత్ వెళ్లేందుకు నిరాకరించింది. భారత మ్యాచ్ ల కోసం తటస్థ వేదిక ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో క్రికెట్ ను రాజకీయాలతో ముడిపెట్టిన పాక్ బోర్డు.. వాళ్ల ఆటగాళ్లను వరల్డ్ కప్ కోసం భారత్ పంపేందుకు నిరాకరించింది. పాక్ కోసం కూడా తటస్థ వేదికను ఏర్పాటు చేయాలని కోరగా.. దాన్ని ఐసీసీ, బీసీసీఐ తిరస్కరించింది. దాంతో తలొగ్గిన పాక్ ప్రభుత్వం.. తమ ఆటగాళ్లను భారత్ పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆటగాళ్లతో సైకాలజిస్ట్లు:

ఈ వరల్డ్ కప్ కోసం పాక్ ఆటగాళ్లతో పాటు సైకాలజిస్ట్ భారత్ పంపించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ సిద్ధమవుతోంది. చాలా సందర్భాల్లో ఒత్తిడికి గురైన పాక్ ప్లేయర్లు చేజేతులా మ్యాచ్ లు ఓడిపోవడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఈ వరల్డ్ కప్ లోనైనా మెరుగ్గా ఆడేందుకు సైకాలజిస్ట్ లను వెంట పంపిస్తోంది. కీలక సమయాల్లో ఆటగాళ్లు ఒత్తిడికి గురైనప్పుడు సైకాలజిస్ట్ వారికి సహాయపడతారు. అంతేకాదు ఆడుతుంది భారత్ లో కాబట్టి.. ఆ టెన్షన్ వేరేలా ఉంటుంది. చుట్టూ వేల మంది అభిమానుల మధ్య మ్యాచ్ ఆడాలంటే కష్టమే. 2011 వరల్డ్ కప్ కు కూడా పాక్ క్రికెట్ బోర్డ్ వాళ్ల ఆటగాళ్లకు సైకాలజిస్ట్ లతో సెషన్స్ నిర్వహించారు.

Updated : 7 Aug 2023 9:16 AM IST
Tags:    
Next Story
Share it
Top