Cricket World Cup 2023: హైదరాబాద్లో వరల్డ్కప్ మ్యాచ్.. ప్రేక్షకులకు నో ఎంట్రీ!
X
స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుంది అన్న ఆనందమే కానీ హైదరాబాద్ వాసుల్లో నిరాశే కనిపిస్తుంది. సొంత మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా కేటాయించలేదని అసంతృప్తితో ఉన్నారు. అయితే విదేశీ జట్ల వార్మప్ మ్యాచ్ లైనా చూసి కొంత ఆనందించుదాం అనుకుంటే.. దానికీ అడ్డంకుటు ఎదురయ్యాయి. హైదరాబాద్ లో జరిగే మొదటి వార్మప్ మ్యాచ్ కు ప్రేక్షకుల ఎంట్రీకి నో చెప్పారు. దీంతో ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు బీసీసీఐపై ఫైర్ అవుతున్నారు. సెప్టెంబర్ 29న హైదరాబాద్ వేదికపై న్యూజిలాంగ్ vs పాకిస్తాన్ మధ్య వార్మప్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కు బుక్ మై షో ద్వారా ఇప్పటికే టికెట్లను విక్రయించారు. దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయి. ఇంతలో హైదరాబాద్ పోలీస్ బాంబు పేల్చారు.
సెప్టెంబర్ 28న హైదరాబాద్ లో గణేశ్ నిమర్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు జరుపుకుంటున్నారు. ఈ వేడుకలు ఒకే రోజున వస్తుండటంతో సిటీలో భద్రత మరింత కట్టుదిట్టం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తర్వాత రోజు జరగబోయే మ్యాచ్ కు సెక్యూరిటీని కల్పించలేమని పోలీస్ శాఖ హెచ్సీఏకు లేఖ రాసింది. మ్యాచ్ ను వేరే తేదీకి పోస్ట్ పోన్ చేయండని కోరింది. అయితే ఇప్పటికే షెడ్యూల్ ప్రిపేర్ అయి, ఐసీసీ సహా మిగతా దేశాలన్నీ ఆమోదం తెలపడంతో మ్యాచ్ ను రీషేడ్యూల్ చేయడం కుదరదని తెలిపింది. దీంతో భద్రత దృష్ట్యా.. మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించే అవకాశం లేదు. ఇప్పటికే బుక్ మై షోక్ ఈ మ్యాచ్ కు టికెట్లు కొన్నవాళ్లకు డబ్బులు రిటర్న్ చేయాలని హెచ్సీఏ ఆదేశించింది. కాగా హైదరాబాద్ స్టేడియంలో రెండు వార్మప్ మ్యాచులు జరుగనున్నాయి. న్యూజిలాండ్ vs పాకిస్తాన్ సెప్టెంబర్ 29న, అక్టోబర్ 3న ఆస్ట్రేలియా vs పాకిస్తాన్.