World Cup 2023: పవర్ ప్లేలో.. నో పవర్.. పాక్ ప్లేయర్లకు గడ్డుకాలం
X
భారత్ లో జరుగుతున్న వరల్డ్ కప్ లో ఎన్నో ఆశలతో వచ్చిన దయాది పాకిస్తాన్ దారుణంగా ఫెయిల్ అవుతుంది. చిన్న జట్లపై మొదటి రెండు మ్యాచుల్లో గెలిచినా.. తర్వాత భారత్, ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచుల్లో దారుణంగా ఫెయిల్ అయింది. చిత్తుగా ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ లో ఫెయిల్ అవుతూవస్తుంది. ఈ టోర్నీలో బ్యాటింగ్ ఆర్డర్ ను ముందుండి నడిపించాల్సిన కెప్టెన్ బాబర్ ఆజం దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. పరుగులు చేయడానికి జంకుతున్నాడు. వాళ్ల ఓపెనింగ్ జోడీ.. ఒక్క మ్యాచ్ లో కూడా శుభారంభాన్ని అందించిలేదు. దీంతో కెప్టెన్, జట్టుపై తీవ్రంగా మండిపడుతున్నారు పాక్ అభిమానులు. భారత్ తో ఓడిపోయిన విషయం పక్కనపెడితే.. నిన్న ఆస్ట్రేలియా చేతిలో 62 పరుగుల తేడాతో ఓడిపోయారు. మొదట బౌలింగ్ లో తేలిపారు. బీకర బౌలింగ్ అటాక్ ఉన్న పాక్ కు.. ఆసీస్ బ్యాటర్లు వార్నర్, మార్ష్ చుక్కలు చూపించారు.
అదిపోతే బ్యాటింగ్ అటాక్ లో కూడా పాక్ రాత మారట్లేదు. నిన్నటి మ్యాచులోనే చూసుకుంటే.. బ్యాటింగ్ పిచ్ పై తేలిపోయారు. ఆసీస్ బ్యాటర్లు స్వేచ్చగా బ్యాటింగ్ చేసిన అదే పిచ్ పై.. పాక్ బ్యాటర్లు విఫలం అయ్యారు. ఇక పవర్ ప్లేలో పాక్ బ్యాటర్ల నుంచి పవర్ కనిపించడం లేదు. ఈ ఏడాది ఆడిన వన్డేల్లో.. పవర్ ప్లే (1-10 ఓవర్లు)లలో పాక్ పేలవ ప్రదర్శన చేస్తుంది. ఇప్పటి వరకు పాక్ బ్యాటర్లు ఎదురుకున్న 1,142 డెలివరీలకుగాను.. ఒక్క సిక్సర్ కూడా ఆ జట్టు ఆటగాళ్లు కొట్టలేకపోయారు. అదే సమయంలో టీమిండియా ఆటగాళ్లు పవర్ ప్లేలో అత్యధికంగా 32 సిక్సర్లు బాదారు. తర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియా 29, సౌతాఫ్రికా 17, ఇంగ్లాండ్ 11, కివీస్ 7, బంగ్లాదేశ్ 6, అఫ్గాన్ 5 సిక్సర్లు నమోదుచేశాయి. పవర్ ప్లేలో ఆ జట్టు రాబడుతున్న రన్స్ కూడా చాలా తక్కువ. మొదటి 10 ఓవర్లలోనే కీలక వికెట్లు డౌన్ అవడంతో.. తర్వాత వచ్చిన బ్యాటర్లు నెమ్మదిగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో పాక్ పవర్ ప్లేలో పవర్ తగ్గిపోయింది.