IND vs PAK : పాకిస్తాన్కు భారీ టార్గెట్.
X
ఆసియా కప్ లో భారత్ కు వాన గండం ఉన్నట్టుంది. ఆడిన ప్రతీ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడుతున్నాడు. పాకిస్తాన్ తో జరిగిన మొదటి వర్షం కారణంగా రద్దయింది. నేపాల్ తో జరిగిన రెండో మ్యాచ్ లో కూడా వర్షం అడ్డుపడింది. దాంతో డక్వర్త్ లూయిస్ మెతడ్ లో (డీఎల్ఎస్) మ్యాచ్ ను కొనసాగించారు. ఇక సూపర్ ఫోర్ లో వేదిక మారింది. వర్షం బారి నుండి తప్పించుకోవచ్చు అనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. కొలంబోలో ఆదివారం (సెప్టెంబర్ 10) పాక్ తో జరిగిన మొదటి సూపర్ 4 మ్యాచ్ కు వర్షం అడ్డుపడింది. దాంతో మ్యాచ్ ను రద్దుచేసి, సోమవారం (సెప్టెంబర్ 11) రిజర్వ్ డేకు షిఫ్ట్ చేశారు.
ఇవాళ కూడా 85శాతం వర్షం పడే చాన్స్ కనిపిస్తుంది. దాంతో ఈ మ్యాచ్ ను కూడా డీఎల్ఎస్ మెతడ్ లో ఆడించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే పాకిస్తాన్ ముందు భారీ టార్గెట్ ఉండే అవకాశం ఉంది. ఓపెనర్ల విరోచిత పోరాటానికి భారత్ 10 ఓవర్లలో 61 పరుగులు చేసింది. ఇవాళ 3 గంటలకు మొదలు కావాల్సిన మ్యాచ్ ఇంకా స్టార్ట్ కాలేదు. దీంతో పాక్ కు భారీ టార్గెట్ వస్తుంది. నిన్న టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్ మన్ గిల్ (58) పరుగులు చేశారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (8), రాహుల్ (17) క్రీజులో ఉన్నారు. మ్యాచ్ రద్దయితే పాక్ టార్గెట్ ఎంతంటే..?