Home > క్రీడలు > Asiacup : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్..

Asiacup : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్..

Asiacup : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్..
X

ఆసియా కప్‌ సూపర్‌ - 4లో భాగంగా భారత్‌ - పాకిస్థాన్‌ తలపడుతున్నాయి. పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. భారత జట్టులో పలు కీలక మార్పులు జరిగాయి. శ్రేయస్ అయ్యర్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చాడు. నేపాల్ మ్యాచుకు దూరంగా ఉన్న బుమ్రా తిరిగి జట్టుతో చేరాడు.

టాస్‌ నెగ్గితే తొలుత బ్యాటింగ్‌ చేయాలని భావించామని రోహిత్ చెప్పాడు. పాక్‌తో మ్యాచ్‌ ఎప్పుడూ సవాల్‌తో కూడుకున్నదేనని అన్నారు. గత మ్యాచ్‌లో తమ బ్యాటర్లు ఆడిన తీరుతో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ఇక జట్టులో రెండు మార్పులు చేసినట్లు రోహిత్ చెప్పారు. శ్రేయస్‌ అయ్యర్‌కు కాస్త వెన్ను నొప్పిగా అనిపించడంతో విశ్రాంతి ఇచ్చామన్న కెప్టెన్.. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చాడన్నారు. ఇక పేసర్‌ బుమ్రా కూడా జట్టుతో జాయిన్ అయినట్లు చెప్పారు.

భారత్‌ జట్టు :

రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌

పాకిస్థాన్ జట్టు

ఫఖర్ జమాన్, ఇమామ్‌ ఉల్ హక్, బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్‌ అష్రాఫ్, షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవుఫ్



Updated : 10 Sep 2023 9:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top