18 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ క్రికెటర్
X
పాకిస్థాన్ క్రికెటర్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెరీర్ మొదట్లోనే వీడ్కోలు పలికి అందరికీ షాక్ ఇచ్చింది. అదెవరో కాదు.. పాకిస్థాన్ కు చెందిన మహిళా క్రికెటర్ అయేషా నసీమ్.. 18 ఏళ్లకే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఇస్లాం మతానికి అనుగుణంగా మరింత పవిత్రంగా జీవితాన్ని గడపడానికి రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిపింది. ఈ వార్తతో పాక్ క్రికెట్ బోర్డ్ షాక్ లోకి వెళ్లిపోయింది. తనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అయేషా నసీమ్ రిటైర్మెంట్ ప్రకటించిందని తెలిపారు.
పాక్ తరపున 2020లో అరంగేట్రం చేసిన అయేషా.. ఇప్పటివరకు 4 వన్డేలు, 33 టీ20 మ్యాచులు ఆడింది. ఆయేషా చివరిగా ఫిబ్రవరిలో ఐర్లాండ్ తరుపున చివరి మ్యాచ్ ఆడింది. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై 45 పరుగులు చేసి వార్తల్లో నిలిచింది. ఆమె కెరీర్ లో ఇదే అత్యదిక స్కోర్ కావడం విశేషం. మంచి పవర్ హిట్టర్ అయిన ఆయేషా.. రిటైర్మెంట్ ప్రకటించడం పాక్ జట్టుకు తీరని లోటు.