Home > క్రీడలు > పంత్ వచ్చేస్తున్నాడు...ఫస్ట్ హాఫ్లో బ్యాటర్గానే..

పంత్ వచ్చేస్తున్నాడు...ఫస్ట్ హాఫ్లో బ్యాటర్గానే..

పంత్ వచ్చేస్తున్నాడు...ఫస్ట్ హాఫ్లో బ్యాటర్గానే..
X

ఐపీఎల్‌-17తో పునరాగమనం చేయబోతున్నాడు స్టార్‌ క్రికెటర్ రిషబ్‌ పంత్‌. ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకుని తిరిగి క్రికెట్ గ్రౌండ్ లో తన సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ టోర్నీలో తొలి అర్ధభాగంలో కేవలం బ్యాటర్‌గా మాత్రమే రిషబ్ ఆడబోతున్నాడు. అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించడంతో పాటు బ్యాటింగ్‌ చేస్తాడని, వికెట్‌ కీపింగ్‌ చేయడని ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్‌ జిందాల్‌ చెప్పాడు.

ప్రస్తుతానికి పంత్ బ్యాటింగ్‌, వికెట్‌కీపింగ్‌ ప్రాక్టీస్ చేస్తున్నాడని అన్నాడు. ఐపీఎల్‌లో ఆడేంత ఫిట్‌గా కనిపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఫస్ట్ మ్యాచ్‌ నుంచే పంత్‌ ఢిల్లీకి కెప్టెన్సీ చేస్తాడని తెలిపాడు. అయితే ఐపీఎల్ టోర్నీలో ఫస్ట్ ఏడు మ్యాచ్‌లు కేవలం బ్యాటర్‌గానే ఆడిస్తామని స్పష్టం చేశాడు. పంత్ పరిస్థితిని బట్టి ఆ తర్వాత తన పాత్ర గురించి ఆలోచిస్తామని జిందాల్‌ తెలిపాడు. అయితే 2022 డిసెంబర్‌ 30న చివరిగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో కనిపించాడు పంత్‌. ఆ సిరీస్ కొన్ని రోజుల తర్వాత రోడ్డు ప్రమాదానికి గురై చికిత్సలు చేయించుకున్నాడు. గాయాలు బాగా కావడంతో రెస్ట్ తీసుకున్నాడు. గాయాలు మానాక జాతీయ క్రికెట్‌ అకాడమీలో మళ్లీ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. ఇటీవల ఓ టీ20 మ్యాచ్‌లో రిషబ్ బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ కూడా చేశాడు.

Updated : 24 Feb 2024 7:26 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top