Home > క్రీడలు > ఆ టోర్నీలో ఆడేందుకు ప్లాన్.. 140 కి.మీ వేగంతో..

ఆ టోర్నీలో ఆడేందుకు ప్లాన్.. 140 కి.మీ వేగంతో..

ఆ టోర్నీలో ఆడేందుకు ప్లాన్.. 140 కి.మీ వేగంతో..
X

గతేడాది డిసెంబర్ లో కార్ యాక్సిడెంట్ కు గురైన రిషబ్ పంత్ ఆరోగ్యంపై అప్ డేట్ విడుదలైంది. ప్రస్తుతం పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ రిహ్యాబిలిటేషన్ సెంటర్ లో ఉన్న పంత్.. నెట్ లో ప్రాక్టీస్ చేస్తూ ఏకంగా 140 కి.మీ వేగంతో విసిరే బంతులను ఎదుర్కొంటున్నాడు. రోజురోజుకు పంత్ మరింత మెరుగుపడుతున్నట్లు ఎన్సీఏ వర్గాలు చెప్తున్నాయి. పంత్ ధైర్యం, కోలుకుంటున్న తీరును చూస్తున్న ట్రైనర్లు ఆశ్చర్యపోతున్నారట. ఈ వివరాల్ని క్రికెట్ మ్యాన్ ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.

పంత్ రీఎంట్రీ ఎప్పుడిస్తాడు? వరల్డ్ కప్ కోసమే కదా ప్రాక్టీస్ చేస్తుంది? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చిన ఎన్సీఏ.. ప్రస్తుతం పంత్ ప్రొఫెషనల్ క్రికెట్ లోకి తిరిగొచ్చే ఫిట్ నెట్ లేదని, క్రికెట్ కు తగ్గట్లు తన శరీరాన్ని మలచుకుంటున్నట్లు చెప్తున్నారు. రాబోయే రెండు నెలల్లో పంత్ ఫిట్ నెస్ పై స్పష్ట వస్తుందని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే.. పంత్ వరల్డ్ కప్ కు దూరం అయినట్లే తెలుస్తోంది.

Updated : 5 Aug 2023 5:52 PM IST
Tags:    
Next Story
Share it
Top