Home > క్రీడలు > Cummins : ఖరీదైన ఆటగాడికే కెప్టెన్సీ.. సన్ రైజర్స్ కొత్త కెప్టెన్గా కమ్మిన్స్

Cummins : ఖరీదైన ఆటగాడికే కెప్టెన్సీ.. సన్ రైజర్స్ కొత్త కెప్టెన్గా కమ్మిన్స్

Cummins : ఖరీదైన ఆటగాడికే కెప్టెన్సీ.. సన్ రైజర్స్ కొత్త కెప్టెన్గా కమ్మిన్స్
X

సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మేనేజ్మెంట్ ఐపీఎల్ కోసం సన్నాహాలు మొదలుపెట్టింది. ఈసారి గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మినీ వేలం ద్వారా స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసిన SRH.. కప్పే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. నిజానికి గత సీజన్లలో సన్ రైజర్స్ ప్రదర్శన దారుణంగా ఉంది. ప్లేయర్లు వరుసగా ఫెయిల్ అవడంతో.. జట్టు పాయింట్స్ టేబుల్లో చివరి స్థానానికి పరిమితమైంది. టీంలో ఉన్న సీనియర్ ప్లేయర్లు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ లను.. ఫ్రాంచైజీ వరుసగా వదులుకుంది. జట్టులో మొత్తం కుర్రాళ్లకే చోటు కల్పించింది. అదే SRHకు దెబ్బ కొట్టింది. దీంతో ఈ సీజన్లో కాస్త ఎక్కువ ధర పెట్టినా.. స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసింది. ట్రావిస్ హెడ్, వనిందు హసరంగ, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్లను SRH సొంతం చేసుకుంది.

తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈసారి కెప్టెన్సీలో మార్పు చేసింది. గత సీజన్లో జట్టును ముందుండి నడిపించిన ఏడెన్ మార్క్రమ్ను కెప్టెన్గా తప్పించింది. ఆ ప్లేస్లో వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా పేస్ బౌలర్ పాట్ కమ్మిన్స్ను రీప్లేస్ చేసింది. సౌతాఫ్రికా 20-20 లీగ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ జట్టుకు కెప్టెన్గా ఉన్న ఏడెన్ మార్క్రమ్.. ఆ జట్టును లీగ్ మొదటి సీజన్లోనే చాంపియన్గా నిలబెట్టాడు. దాంతో 2023 వేలంలో SRH.. మార్క్రమ్ను కొనుగోలు చేసి కెప్టెన్సీ ఇచ్చింది. అయితే ఐపీఎల్లో మాత్రం మార్క్రమ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. సన్ రైజర్స్ రాత మార్చలేకపోయాడు. దీంతో సన్ రైజర్స్ను సౌతాఫ్రికా 20-20 లీగ్లో మరోసారి చాంపియన్గా నిలబెట్టినా.. ఫలితం లేకపోయింది. కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోవాల్సి వచ్చింది.

అనూహ్యంగా ఆస్ట్రేలియా పగ్గాలు అందుకున్న పాట్ కమ్మిన్స్ చాంపియన్స్ ట్రోఫీ, వన్డే వరల్డ్ కప్స్ అందించాడు. అటు బాల్తోనే కాదు.. బ్యాటుతోనూ జట్టును ముందుండి నడిపించాడు. దీంతో SRH మేనేజ్మెంట్కు పాట్ కమ్మిన్స్పై ఆపారమైన నమ్మకం కలిగింది. హైదరాబాద్ రాత మార్చుతాడన్న నమ్మకంతో 20 కోట్లు పెట్టి మరీ కమ్మిన్స్ను వేలంలో సొంతం చేసుకుంది. కమ్మిన్స్ ట్రాక్ రికార్డ్ను దృష్టిలో పెట్టుకుని.. కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది.








Updated : 4 March 2024 7:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top