Home > క్రీడలు > ఐపీఎల్ చరిత్రలో రికార్డు.. ఆసీస్ కెప్టెన్కు రికార్డు ధర

ఐపీఎల్ చరిత్రలో రికార్డు.. ఆసీస్ కెప్టెన్కు రికార్డు ధర

ఐపీఎల్ చరిత్రలో రికార్డు.. ఆసీస్ కెప్టెన్కు రికార్డు ధర
X

ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్కు వేలంలో భారీ ధర పలికింది. అతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసింది. కమిన్స్ కోసం ఎస్ఆర్హెచ్ - ఆర్సీబీ తీవ్ర పోటీ పడ్డాయి. చివరకు సన్ రైజర్స్ రికార్డు ధరకు సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ట్రోఫీ గెలవడంలో కమిన్స్ కీలక పాత్ర పోషించాడు. మరో ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను ఎస్ఆర్హెచ్ రూ. 6.80 కోట్లకు దక్కించుకుంది. హెడ్ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్ పోటీపడగా..చివరకు హైదరాబాద్ సొంతం చేసుకుంది.

అదేవిధంగా శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగను 1.5కోట్లకు సొంతం చేసుకుంది. ఇక వెస్టిండీస్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్ సైతం భారీ ధరకు అమ్ముడుపోయాడు. అతడి బేస్ ధర కోటి రూపాయలు కాగా.. ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ 7.40 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ను ఢిల్లీ క్యాపిటల్స్ 4కోట్లకు దక్కించుకుంది. మరికొందరు ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్, కరుణ్ నాయర్ లను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.

Updated : 19 Dec 2023 8:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top