Home > క్రీడలు > Pakistan Cricket Team : క్రికెటర్ల ఫిట్నెస్పై బోర్డ్ ఫైర్.. రంగంలోకి ఆర్మీ

Pakistan Cricket Team : క్రికెటర్ల ఫిట్నెస్పై బోర్డ్ ఫైర్.. రంగంలోకి ఆర్మీ

Pakistan Cricket Team : క్రికెటర్ల ఫిట్నెస్పై బోర్డ్ ఫైర్.. రంగంలోకి ఆర్మీ
X

పాకిస్తాన్ క్రికెటర్లకు పాక్ ఆర్మీతో శిక్షణ ఇప్పించాలని పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్) నిర్ణయం తీసుకుంది. తమ క్రికెటర్లు భారీ సిక్సర్లు కొట్టలేకపోతున్నారని పీసీబీ చైర్మన్ మొహసీన్ నక్వీకు చిరాకేసింది. తాను మ్యాచ్ చూస్తుండగా ఒక్కరు కూడా సిక్సర్ కొట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ కారణంగా ప్లేయర్లకు వారి సైనికులతో ట్రైనింగ్ ఇప్పించేందుకు సిద్ధమయ్యారు. మార్చి. ఏప్రిల్ నెలలో వారి సైన్యం ఆర్మీ క్యాంపులో పాల్గొంటుందని తెలిపారు. ప్రస్తుతం పీఎల్ఎస్ జరుగుతుండగా.. అది పూర్తి కాగానే దాదాపు 10 రోజుల పాటు క్యాంపు ఉంటుందని చెప్పారు.





ప్రతీ ఆటగాడి ఫిట్ నెస్ ను మెరుగుపరిచేందుకు బోర్డ్ ఈ ప్లాన్ రెడీ చేసిందన్నారు. దీని ప్రకారం ప్లేయర్లు ప్రిపేర్ అయితే.. రాబోయే న్యూజిలాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్, టీ20 వరల్డ్ కప్స్ లో మంచి ప్రదర్శన చేసే అవకాశం ఉంటుందని ప్లేయర్లకు సూచించారు. ప్లేయర్లు జాతీయ జట్టుకు ఆడేందుకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని నక్వీ కోరారు. కాగా పాక్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ను బోర్డ్ ఇటీవలే తొలగించింది. జూన్ 30 వరకు విదేశీ లీగ్ లు ఆడకుండా నిషేదం విధించింది. మరో మాజీ ప్లేయర్ ఆఖిద్ జావెద్.. పాకిస్తాన్ టీంలో ప్లేయర్లకంటే రెజ్లర్లే ఎక్కువ కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్లేయర్లు ఫిట్ గా లేరని చెప్పాడు.




Updated : 6 March 2024 8:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top