NZ vs AFG: స్పిన్కు అనుకూలించినా.. తేలిపోయారు.. కివీస్ భారీ స్కోర్
X
వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఓటమి ఎరుగని న్యూజిలాండ్.. పోయిన మ్యాచ్ లో అద్భుత పోరాటంతో ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఆసక్తకర పోరు నడుస్తుంది. చెన్నై వేదికగా అఫ్ఘానిస్తాన్ తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 రన్స్ చేసింది.
పిచ్.. స్పిన్‌కు అనుకూలించినా.. ఆఫ్ఘన్ స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోయారు. ఓపెనర్ డెవాన్ కాన్వే (20) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్ విల్ యంగ్ (54) రాణించాడు. రచిన్ రవీంద్ర (32)తో కలిసి కివీస్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. తర్వాత వీరిద్దరూ వెనుదిరిగినా.. టామ్ లాథమ్ (68), గ్లెన్ ఫిలిప్స్ (71) జోడి నిలకడగా ఆడుతూ ఆఫ్ఘన్ ముందు భారీ స్కోర్ ఉంచింది. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్, అజ్మతుల్లా ఒమర్జాయ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 289 పరుగుల లక్ష్య చేదనలో ఆఫ్ఘన్ 15 ఓవర్లకు 48 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. బౌల్ట్, హెన్రీ, ఫెర్గుసన్ చెరో వికెట్ తీసుకున్నారు.