IND vs AUS: ఈ లెక్కన వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచేది టీమిండియానే!
X
ఎన్నో ఆశలతో, కోట్లాది మంది ఆశయంతో ఫైనల్స్ కు చేరుకున్న టీమిండియా ఈసారి కప్పు గెలవాలని ఆశిస్తున్నారు. టోర్నీ మొత్తంలో చూపించిన ప్రదర్శన.. ఒత్తిడిని జయిస్తే కప్పు కచ్చితంగా భారత్ గులుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘We are with you teamindia’ అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి సపోర్ట్ ఇస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో భారత్ గెలుస్తుందని ఇప్పటికే పలువురు జోతీష్యులు చెప్పగా.. మరో కొత్త క్యాలుక్యులేషన్ తో ఫ్యాన్స్ ఓ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు. గత టోర్నీల్లో గెలిచిన జట్టులపై అభిమానులు రీసెర్చ్ మొదలెట్టి.. వరల్డ్ కప్ ట్రోఫీ టీమిండియానే గెలుస్తుందని అంతా ధీమాగా ఉన్నారు. ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. గత మూడు టోర్నీల్లోనూ ట్రోఫీకి కుడివైపు ఉన్న కెప్టెన్ టీం గెలుస్తూ వస్తుంది. ఈ లెక్కన ఈ వరల్డ్ కప్ కు జరిగిన ఫొటోషూట్లో ట్రీఫీకి కుడివైపున రోహిత్ శర్మ నిల్చున్నాడు. దీంతో కప్ భారత్ గెలుస్తుందని అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు.