Home > క్రీడలు > నేను ఆడినట్లు పుజారా భాయ్‌ ఆడలేడు : పృథ్వీషా

నేను ఆడినట్లు పుజారా భాయ్‌ ఆడలేడు : పృథ్వీషా

నేను ఆడినట్లు పుజారా భాయ్‌ ఆడలేడు : పృథ్వీషా
X

టీమిండియాలో రీ ఎంట్రీ కోసం వేచి చూస్తున్న ఆటగాళ్లలో యువ ఓపెనర్ పృథ్వీషా ఒకడు. అద్భుతమైన టాలెంట్‌తో జట్టులోకి వచ్చి నిలకడలేమీ కారణంగా స్థానాన్ని కోల్పోయాడు. ఐపీఎల్, దేశవాలిలోనూ ఫామ్ అంతంతమాత్రంగానే ఉండడంతో సెలెక్టర్లు పృథ్వీషాను పక్కన పెట్టేశారు. వెస్టిండీస్ టూర్‌కు భారత్ టీ20 జట్టులో యువకులకు పెద్దపీట వేసిన సెలక్టర్లు పృథ్వీషాకు మాత్రం మొండి చేయి చూపారు. చివరిగా టీమిండియా తరఫున జులై 2021లో శ్రీలంకతో టీ20 మ్యాచ్‌లో పృథ్వీ షా బరిలో దిగాడు. ప్రస్తుతం జట్టులో స్థానం కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు.

ఐపీఎల్ 2023లోను పృథ్వీషా దారుణంగా విఫలమయ్యాడు. ఢిల్లీ జట్టు అవకాశాలు కల్పించినా వినియోగించుకోలేకపోయాడు. దీంతో అతడి ఆటతీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా విమర్శలపై స్పందించాడు ఈ యంగ్ ప్లేయర్. తన ఆటతీరును మార్చుకునే ఉద్దేశంల లేదని తెలిపాడు. అయితే ఇంకాస్త తెలివిగా ఆడతానని వివరించాడు. తాను ఆడినట్లు పుజారా భాయ్ ఆడలేడని, అదే విధంగా పుజారా ఆడినట్లు తాను కూడా ఆడలేనని స్పష్టం చేశారు. అందుకే తన బ్యాటింగ్‌లో దూకుడు తగ్గదని తెలిపాడు. దేశవాళీలో రాణిస్తే భారత జట్టుకు ఎంపిక కావడానికి మరిన్ని అవకాశాలు వస్తాయన్నాడు. అందుకోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటానని పేర్కొన్నాడు. జట్టులోకి తిరిగి వచ్చే ప్రయత్నంలో ప్రతి పరుగులు తనకు అవసరమని పృథ్వీషా స్పష్టం చేశాడు. దులీఫ్ ట్రోఫి తనకు చాలా ముఖ్యమన్నాడు.

తాజాగా దులీఫ్ ట్రోఫిలో వెస్ట్ జోన్ తరఫున పృథ్వీషా ఆడుతున్నాడు. అతడు సెంట్రల్ జోన్‎తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 25 , 26 పరుగులను మాత్రమే చేశాడు. అదే టీమ్ లో ఉన్న పుజారా సెంచరీతో చెలరేగాడు. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 92 పరుగుల ఆధిక్యంతో వెస్ట్ జోన్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది.జులై 12 నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వెస్ట్‌ జోన్‌, సౌత్‌ జోన్‌ మధ్య దులీప్‌ ట్రోఫీ ఫైనల్ ప్రారంభంకానుంది.



Updated : 9 July 2023 8:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top