Home > క్రీడలు > నేనెవరితో పోరాడలేను.. నా కెరీర్లో అలా ఎందుకు జరుగుతుందో: పృథ్వీషా

నేనెవరితో పోరాడలేను.. నా కెరీర్లో అలా ఎందుకు జరుగుతుందో: పృథ్వీషా

నేనెవరితో పోరాడలేను.. నా కెరీర్లో అలా ఎందుకు జరుగుతుందో: పృథ్వీషా
X

టీమిండియాలో మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్స్ లో ఒకరు పృథ్వీషా. కెరీర్ ఆరంభంలో మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ అంటూ ప్రశంసలు అందుకున్న పృథ్వీషా.. రాను రాను ఫామ్ కోల్పోయి జట్టులో ఆశలు పోగొట్టుకున్నాడు. గత కొంత కాలంగా జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని ఊరించి.. చివరికి నిరాశ పరిచాడు. అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కొన్నేళ్ల పాటు సూపర్ ఫామ్ ను కొనసాగించిన పృథ్వీషా.. గత రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. అతను సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడు అతన్ని సపోర్ట్ ఇవ్వలేదు బీసీసీఐ. దాంతో నిరాశ చెందిన పృథ్వీషా.. కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘టీంలో చోటు దక్కనప్పుడు దానికి కారణం ఏంటో నాకు తెలియలేదు. ఫిట్ నెస్ వల్ల నన్ను దూరం పెడుతున్నారంటే.. బెంగళూరు ఎన్ సీఏలో చేరా. ఫిట్ నెస్ సాధించి.. అన్ని పరీక్షలు క్లియర్ చేశా. దేశవాళీలోనూ పరుగులు రాబట్టా. టీ20ల్లో తిరిగి వచ్చా. అయినా, వెస్టిండీస్ సిరీస్ లో నన్నెందుకు తీసుకోలేదో నాకు అర్థం కాలేదు. దాంతో తీవ్ర నిరాశ చెందా. ప్రస్తుతం పరిస్థితులను అంగీకరించి ముందుకు వెళ్లడం తప్ప చేసేదేం లేదు. ఎవరితో పోరాడలేను’ అని అన్నాడు.

‘ నాకు స్నేహితులే కూడా ఎవరూ లేరు. నా గురించి చాలామంది చాలా విషయాలు చెప్తారు. కానీ, నేనేంటో తెలిసిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. నాకున్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తో అన్నీ పంచుకోలేను. ఎందుకంటే నాకు భయంగా ఉంటుంది. వాళ్లతో ఏ విషయం షేర్ చేసుకున్నా.. తర్వాతి రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంద’ని పృథ్వీషా అన్నాడు. 2021లో పృథ్వీషా తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు.




Updated : 18 July 2023 5:02 PM IST
Tags:    
Next Story
Share it
Top