India vs England : ముగిసిన టీమిండియా స్టార్ బ్యాటర్ల అధ్యాయం.. రీఎంట్రీ ఇక కష్టమే..!
X
టీమిండియా క్రికెట్ లో.. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో చటేశ్వర పూజారా, అజింక్య రహానేల అధ్యాయం ముగిసిందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. పూజారా, రహానేలిద్దరు టీమిండియాకు సుధీర్ఘంగా ఆడారు. కీలక విజయాల్లో ముఖ్య పాత్ర పోషించారు. అయితే కొన్నిరోజులుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వీరికి.. ఎన్ని అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇదే టైంలో జట్టులో పోటీ ఎక్కువైంది. దీంతో సెలక్టర్లు వీరిని తప్పించి కొత్తవారికి చోటిచ్చారు. ప్రస్తుతం వీరి అధ్యాయం ముగిసినట్లే. ఎందుకంటే.. ప్రస్తుతం పుజారా కౌంటీల్లో ఆడుతున్నాడు. రహానే రంజీల్లో రాణిస్తున్నారు. అక్కడ వీరిద్దరు మెరుగైన ప్రదర్శన చేస్తున్నా.. స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో సెలక్టర్లు వీరిని పక్కనబెట్టారు. దీంతో వీరి కెరీర్ కు ఇక ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తుంది.
అయితే రహానేకు ఇంకా చాన్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. అతను ఐపీఎల్ లో చెన్నై తరుపున ఆడుతున్నాడు. గత సీజన్ లో అనూహ్యంగా జట్టులో ఎంట్రీ ఇచ్చిన రహానే రెచ్చిపోయి ఆడాడు. దీంతో టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ లో ఆడే అవకాశం వచ్చింది. మళ్లీ అదే జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు. గతంలో కూడా అదే జరిగింది. ఇంగ్లాండ్ పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేసిన రహానే వెస్టిండీస్ పర్యటనకు సెలక్ట్ కాగా.. పుజారాకు మొండిచేయి ఎదురైంది. అయితే వెస్టిండీస్ సిరీస్ లో ఫెయిల్ అయిన రహానే.. ఇక జట్టులో ఎంట్రీ కోల్పోయాడు. ప్రస్తుతం రంజీ, కౌంటీల్లో పుజారా రాణిస్తున్నాడు. అతనిపై సెలక్టర్లు కరుణ చూపించి చివరి అవకాశం ఏమైనా ఇస్తారో లేదో చూడాలి.