Home > క్రీడలు > Virat 48 Century: కోహ్లీపై పుజారా నెగటివ్ కామెంట్స్.. అలా అనేశాడేంటి..?

Virat 48 Century: కోహ్లీపై పుజారా నెగటివ్ కామెంట్స్.. అలా అనేశాడేంటి..?

Virat 48 Century: కోహ్లీపై పుజారా నెగటివ్ కామెంట్స్.. అలా అనేశాడేంటి..?
X

వరల్డ్కప్ పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉండాల్సిన టీమిండియా.. విరాట్ కోహ్లీ వల్ల రెండో స్థానంలో నిలిచిందని హాట్ కామెంట్స్ చేశాడు పుజారా. కోహ్లీ ఏ మాత్రం జట్టు గురించి ఆలోచించకుండా.. సెంచరీ కోసం బాల్స్ వేస్ట్ చేశాడని తప్పుబట్టాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. చేజింగ్ టైంలో జట్టుకు 48 పరుగులు కావాల్సి ఉండగా.. కోహ్లీ అప్పటికే 68 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నాడు. 37వ ఓవర్ లో కేఎల్ రాహుల్ 6,4 కొట్టడంతో.. ఆ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. దాంతో చేయాల్సిన పరుగులు 28కి తగ్గాయి. కోహ్లీ సెంచరీకి 27 పరుగులు కావాలి. ఇద్దరు ప్రధాన బ్యాటర్లు క్రీజులో ఉన్నప్పుడు ఒక్కరే అన్ని పరుగులు చేయడం కష్టం.

యితే చేతిలో కావాల్సినన్ని ఓవర్లు ఉండటంతో కోహ్లీ సెంచరీపై దృష్టిపెట్టాడు. అతని ఆలోచనకు తగ్గట్లు రాహుల్ కూడా బాల్స్ డాట్ చేస్తూ కోహ్లీకి స్ట్రైక్ ఇచ్చాడు. సింగిల్స్ తీసే అవకాశం ఉన్నా వెనక్కితగ్గారు. దీంతో కోహ్లీ వన్డేల్లో 48వ సెంచరీ, అంతర్జాతీయ క్రికెట్ లో 78వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో స్పందించిన పుజారా.. వ్యక్తిగత రికార్డులకంటే.. జట్టు ప్రయోజనాల కోసమే ఆడాలని పరోక్షంగా మాట్లాడాడు. ఇలాంటి టోర్నీల్లో రన్ రేట్ చాలా ముఖ్యం. కొద్దిపాటి తేడాలతో ఫలితాలు తారుమారు అవుతాయి. అందుకే వీలైనంత త్వరగా రన్స్ చేయాలి. అవకాశం ఉన్నా బాల్స్ డాట్ చేశారు. దాని ఫలితం.. రన్ రేట్ తగ్గి జట్టు ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి పడిపోయిందని పుజారా చెప్పుకొచ్చాడు.

Updated : 21 Oct 2023 1:19 PM IST
Tags:    
Next Story
Share it
Top