Home > క్రీడలు > IND vs ENG: ఇంగ్లాండ్ టెస్టులకు విరాట్ కోహ్లీ లేడు.. మరి అతని స్థానంలో ఆడేదెవరు?

IND vs ENG: ఇంగ్లాండ్ టెస్టులకు విరాట్ కోహ్లీ లేడు.. మరి అతని స్థానంలో ఆడేదెవరు?

IND vs ENG: ఇంగ్లాండ్ టెస్టులకు విరాట్ కోహ్లీ లేడు.. మరి అతని స్థానంలో ఆడేదెవరు?
X

భారత్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. జనవరి 25 నుంచి ప్రారంభం కాబోయే ఈ టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ రెండు టెస్టులకు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. మొదటి రెండు టెస్టులకు బీసీసీఐ ఇటీవల జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే మరో ప్లేయర్ ను సెలక్టర్లు ఎంపిక చేయాల్సి ఉంది. స్వదేశంలో టెస్టులకు కోహ్లీ లేకపోవడం జట్టుకు తీరని లోటే. అయితే అతన్ని భర్తీ చేస్తూ ఎవరికి జట్టులోకి ఎంపిక చేస్తారా అనేది మాత్రం.. క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ రేసులో నలుగురు ప్లేయర్లు ఉన్నట్లు తెలుస్తుంది.

కోహ్లీ దూరం అవడంతో.. జట్టులోకి వెటరన్ ఆటగాడు చటేశ్వర్ పుజారాను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఫామ్ లో లేని కారణంగా జట్టు నుంచి సెలక్టర్లు పుజారాను తప్పించారు. దీంతో గతేడాది టెస్ట్ చాంపియన్షిప్ ముగిసినప్పటి నుంచి పుజారా జట్టుకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం కౌంటీ, రంజీ ట్రోఫీల్లో రాణిస్తున్న పుజారాను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. పుజారా అనుభవం, రికార్డులు జట్టుకు కలిసొచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా.. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్ లో వెనకబడి ఉన్న టీమిండియాకు ఈ సిరీస్ చాలా కీలకం. దాంతో సెలక్టర్లు పుజారా విషయంలో ఆలోచించే అవకాశం ఉంది.

కాగా కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చేందుకు ముగ్గురు యువ ఆటగాళ్లు సిద్దంగా ఉన్నారు. సర్ఫరాజ్‌ ఖాన్‌, రజత్ పటీదార్, సాయి సుదర్శన్‌ రేసులో ఉన్నారు. ఇందులో రజత్ పటీదార్ ముందువరుసలో ఉన్నాడు. ఇప్పటికే సాయి సుదర్శన్ వన్డేల్లో భారత్ తరుపున అరంగేట్రం చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ రాణిస్తున్నా అతనికి అవకాశాలు ఇవ్వట్లేదని బీసీసీఐని చాలామంది విమర్శిస్తున్నారు. కాగా ప్రస్తుత ఫామ్ ను బట్టి చూస్తే.. రజత్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపించే అవకాశం ఉంది. అంతేకాకుండా అతను తాజాగా ఇండియా-ఏ జట్టుకు ఎంపికై అద్భుతంగా ఆడుతున్నాడు. 26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ స్పిన్ పిచ్ లపై సమర్థంగా ఆడగలడు. తాజాగా ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన తొలి అనధికార టెస్టులో హాఫ్ సెంచరీ సాధించాడు. అంతకుముందు వార్మప్ మ్యాచ్ లో 96 పరుగులు చేశాడు. కాగా తుది నిర్ణయం బీసీసీఐదే కాబట్టి.. ఈ నలుగురిలో ఎవరికి అవకాశం దక్కుతుందో తెలియాల్సి ఉంది.




Updated : 23 Jan 2024 3:47 PM GMT
Tags:    
Next Story
Share it
Top