Home > క్రీడలు > లా ఎగ్జామ్లో కోహ్లీపై ప్రశ్న.. ఏమని అడిగారో తెలుసా?

లా ఎగ్జామ్లో కోహ్లీపై ప్రశ్న.. ఏమని అడిగారో తెలుసా?

లా ఎగ్జామ్లో కోహ్లీపై ప్రశ్న.. ఏమని అడిగారో తెలుసా?
X

క్రికెట్ లో కెప్టెన్ గా, ప్లేయర్ గా మంచి గుర్తింపు సంపాదించి లెజెండ్ స్థాయికి చేరుకున్నాడు విరాట్ కోహ్లీ. అతని జర్నీ, మైలు రాళ్ల గురించి ఎంత మాట్లాడుతున్నా తక్కువే. తన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కోహ్లీ.. చాలామంది కుర్రాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. ఇటీవలే వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసి సచిన్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఈ ఘనత అందుకున్న తొలి ప్లేయర్ గా నిలిచాడు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే పలు పుస్తకాల్లో కోహ్లీ స్టోరీ చేర్చగా.. ఇప్పుడు అతని పేరు పరీక్షల్లో కూడా దర్శనమిస్తుంది. తాజాగా కోహ్లీకి సంబంధించిన ఒక ప్రశ్న ఆల్ ఇండియా లా ఎగ్జామ్ లో అడగడం విశేషం. ఇటీవల జరిగిన లా ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఐపీఎల్ కు సంబంధించిన ప్రశ్న వైరల్ గా మారింది.

2008లో ఐపీఎల్ మొదలైంది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఒకే జట్టుకు (ఫ్రాంచైజ్) ఆడిన ప్లేయర్ ఎవరు? అని ప్రశ్న అడగగా.. దీనికి సంబంధించి ఆప్షన్స్ గా బెన్ స్టోక్స్, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా పేర్లను ఇచ్చారు. దీంతో కోహ్లీ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. రాయల్ చాలెంజర్స్ తరుపున ఆడుతున్న కోహ్లీ.. అదే జట్టుతో మొత్తం 16 ఐపీఎల్ సీజన్లు పూర్తి చేశాడు. ఆర్సీబీ తరుపున 237 మ్యాచులు ఆడగా.. 7263 పరుగులు చేశాడు. 7 సెంచరీలతో పాటు 50 హాఫ్ సెంచరీలు విరాట్ ఐపీఎల్ కెరీర్ లో ఉన్నాయి.

Updated : 10 Dec 2023 6:31 PM IST
Tags:    
Next Story
Share it
Top