Home > క్రీడలు > World Cup 2023: భారత కుర్రాడే.. ఇంగ్లాండ్కు చుక్కలు చూపించిన ‘రచిన్ రవీంద్ర’ ఎవరు?

World Cup 2023: భారత కుర్రాడే.. ఇంగ్లాండ్కు చుక్కలు చూపించిన ‘రచిన్ రవీంద్ర’ ఎవరు?

World Cup 2023: భారత కుర్రాడే.. ఇంగ్లాండ్కు చుక్కలు చూపించిన ‘రచిన్ రవీంద్ర’ ఎవరు?
X

వరల్డ్కప్లో డెబ్యూ ప్లేయర్.. పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. అయినా ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీ చేసి.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ కూడా గెలుచుకున్నాడు. ఆడుతుంది వేరే దేశం తరుపున అయినా.. అతని మూలాలు ఉన్నది భారత్ లోనే. కివీస్ తరుపున బరిలోకి దిగి మొదటి మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం అతని పేరు క్రికెట్ అభిమానుల్లో మారుమ్రోగుతుంది. కేన్ విలియమ్సన్ స్థానంలో బరిలోకి దిగిన 23 ఏళ్ల రచిన్ రవీంద్ర.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై చెలరేగాడు. కేవలం 96 బంతుల్లోనే 1 ఫోర్, 5 సిక్సర్లతో 123 పరుగులు చేసి అజేయంగా నలిచాడు. ఓపెనర్ డెవాన్ కాన్వేతో కలిసి రెండో వికెట్ కు 273 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి.. అందరి ప్రశంసలు అందుకున్నాడు. అప్పటి నుంచి రచిన్ గురించే చర్చ. ఇంతకీ ఎవరితను? భారత్ వ్యక్తి న్యూజిలాండ్ కు ఎలా ఆడుతున్నాడు? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతని పేరేంటి కాస్త విచిత్రంగా ఉందని నెట్ లో తెగ వెతుకుతున్నారు.

ఎవరీ రచిన్ రవీంద్ర:

రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు భారతీయులే. బెంగళూరుకు చెందిన రవి కృష్ణమూర్తి 1990లో న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. రచిన్ కూడా అక్కడే జన్మించాడు. తల్లిదండ్రులతో పాటు రచిన్ కు కూడా క్రికెట్ అంటే ఇష్టం. దాంతో రచిన్ తండ్రి రవి.. అతనికి క్రికెట్ కోచింగ్ ఇప్పించాడు. 2021లో భారత్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ తరుపున అరంగేట్రం చేశాడు రచిన్. అయితే న్యూజిలాండ్ సిటిజన్ అయిన క్రికెట్ ట్రైనింగ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నాడు. ప్రతీ ఏడాది అనంతపురం వచ్చి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ లో ట్రైనింగ్ పొందేవాడు. అక్కడి స్థానిక క్రికెట్ టోర్నీల్లో కూడా ఆడేవాడు.

రచిన్ పేరుకు అర్థం ఏంటి?

రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తికి క్రికెట్ అంటే ఇష్టం. భారత్ మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ లకు వీరాభిమాని. అందుకే వాళ్ల పేర్లు కలిసొచ్చేలా.. రచిన్ రవీంద్ర పేరు పెట్టాడు. ఈ పేర్లను రాహుల్ ద్రవిడ్ లో ‘ర’, సచిల్ లో ‘చిన్’ తీసుకుని రచిన్ అనే పేరు పెట్టాడు రవి కృష్ణమూర్తి. రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ తరపున ఇప్పటి 3 టెస్ట్ మ్యాచ్ లు, 12 టెస్టులు, 18 టీ20 మ్యాచ్ లు ఆడాడు. కాగా రచిన్ అంతర్జాతీయ కెరీర్ లో ఇదే తొలి సెంచరీ.

Updated : 6 Oct 2023 2:02 PM IST
Tags:    
Next Story
Share it
Top