Rahkeem Cornwall : మొదటి పరుగుకే పరిగెత్తలేక రనౌట్..వీడియో వైరల్
X
క్రికెట్లో వికెట్ల మధ్య పరిగెత్తడం చాలా కీలకం. ఎన్ని సిక్లర్లు, ఫోర్లు బాదిన క్రీజు మధ్య చిరుతలా పరిగెట్టే వేగం ఉండాలి. ఇలా తీసిన క్విక్ రన్స్ మ్యాచ్ ఫలితాన్ని ఒక్కోసారి డిసైడ్ చేస్తాయి. అయితే కొంతమంది ప్లేయర్స్ సింగిల్స్ చేయడానికి పెద్దగా ఇష్టపడ్డరు. వారు పరిగెత్తలేక బౌండరీలు బాదేందుకే ఎక్కువ ఇష్టపడతారు. అలాంటి వారిలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఒకడు. భారీ శరీరం కలిగే ఉండే ఇంజమామ్ ఎక్కువగా రనౌట్లు అయ్యేవాడు. వికెట్ల మధ్య పరుగులు తీయడంలో మాత్రం చాలా ఇబ్బంది పడేవాడు. అతడికి మహ బద్దకస్తుడు అని పేరు కూడా ఉంది.
అలాంటి ఇంజమామ్‌ను వెస్టిండీస్ ప్లేయర్ రఖీమ్ కార్నివాల్ గుర్తుచేస్తున్నాడు. దాదాపు 6 అడుగుల ఆరు అంగుళాల ఎత్తు.. 140 పైగా కిలోల బరువు ఉండే ఈ ఆటగాడికి సింగిల్స్, డబుల్స్ చేయడం అంటే చాలా కష్టం. వచ్చిన బంతిని వచ్చినట్టు బాదడమే తప్పా పరుగులు తీసేందుకు పెద్దగా ఇష్టపడడు. తాజాగా మరోసారి అతడు అదే రుజువు చేశాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కార్నివాల్ రనౌట్ అయ్యాడు.
కార్నివాల్ ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా బార్బడోస్,సెయింట్ లూసియా మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదటి బంతికే కార్నివాల్ రనౌట్ అయ్యాడు. బార్బోడస్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ఫోర్డే బౌలింగ్‌లో మొదటి బంతిని షార్ట్‌లెగ్ దిశగా కార్నివాల్ ఆడాడు. అయితే అక్కడ ఉన్న ఫీల్డర్ బంతిని మిస్ చేశాడు. దీంతో నాన్ స్ట్రైకర్ రన్‌కు వచ్చేసిన కార్నివాల్ వేగంగా కదలలేకపోయాడు. ఓ రెండు అడుగులు వేసి ఔట్ ఐతే అయ్యాలే అని నడుస్తూ వచ్చాడు. ఇంతలో ఫీల్డర్ విసిరిన త్రో వికెట్లను తాకడంతో కార్నివాల్ పెవిలియన్‌కు చేరాడు. . ఈ రనౌట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో పాపం.. కార్నివాల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అతడిని ఇంజమామ్ తో పోలీస్తున్నారు.
A Rahkeem Cornwall runout in the CPL. pic.twitter.com/HUfc5Nybhd
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 18, 2023