IND vs SA: హార్దిక్ స్థానంలో.. ప్రసిద్ధ్ కృష్ణను అందుకే తీసుకున్నాం: రాహుల్ ద్రావిడ్
X
ప్రపంచకప్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తుంది. ఆడిన 7 మ్యాచుల్లో గెలుపొంది అజేయంగా నిలిచింది. ఇవాళ కోల్ కతా వేదికపై సౌతాఫ్రికాతో తలపడుతుంది. ఇటీవల హార్దిక్ పాండ్యా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. అతని స్థానంలో యువ పేస్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు. దాంతో క్రికెట్ ఎక్స్ పర్ట్స్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ను విమర్శించడం మొదలుపెట్టారు. దీనిపై క్లారిటీ ఇచ్చిన రాహుల్ ద్రావిడ్ ప్రసిద్ధ్ ను తీసుకోవడానికి గల కారణాన్ని వివరించాడు.
‘మేం తీసుకున్నది సరైన నిర్ణయమే. ప్రస్తుతం ముగ్గురు పేస్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడుతున్నాం. స్పిన్ లో అశ్విన్, ఆల్ రౌండర్లలో శార్దూల్ ఠాకూర్ బ్యాకప్ గా ఉన్నారు. పేస్ దళానికే ఎవరూ బ్యాకప్ లేరు. అందుకే ప్రసిద్ధ్ కృష్ణను తీసుకున్నాం. ఇది కాంబినేషన్స్ ప్రయోగించడానికి ఉపయోగపడుతుంది’ అని వివరించాడు. ఇప్పటి వరకు 17 వన్డేలు ఆడిన ప్రసిద్ధ్ 29 వికెట్లు తీసుకున్నాడు. వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే సిరీస్ లో ఆడి సత్తాచాటాడు. అందుకే ప్రసిద్ధ్ పై టీం మేనేజ్మెంట్ మొగ్గుచూపి ఉంటుంది. ప్రస్తుతం టీమిండియా పేస్ దళంలో బుమ్రా, షమీ, సిరాజ్ అదరగొడుతున్నారు. వీళ్లలో ఎవరికైనా గాయం అయితే ప్రసిద్ధ్ ను ఆడిస్తారు.