IND vs NZ : రేపు ధర్మశాలలో ఇండియా - న్యూజిలాండ్ మ్యాచ్
X
ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా రేపు న్యూజిలాండ్‌తో తలపడనుంది. ధర్మశాలలోని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. భారత జట్టు ఐదోమ్యాచ్‌పై అందరి దృష్టి నెలకొంది. వరల్డ్ కప్లో భాగంగా ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడగా ఇరు జట్లు ఏ ఒక్కదాంట్లోనూ ఓడిపోలేదు. ఈ క్రమంలో ఆదివారం జరగనున్న మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్కు వానగండం పొంచి ఉంది. తుఫాను కారణంగా ధర్మశాలలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. మధ్యాహ్నం సమయానికి తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు చెప్పారు. ధర్మశాలలో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 13 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఆకాశం 74శాతం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రానికి ఉష్ణోగ్రత మరింత పడిపోతుందని ప్రకటించింది. ఈ క్రమంలో మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగిస్తాడన్న ఆందోళన నెలకొంది.
భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ కు వర్షం కారణంగా అంతరాయం కలిగినా రిజర్వ్ డే ఉండదు. మ్యాచ్ రద్దైతే నిబంధనల ప్రకారం టీమిండియా, కివీస్ జట్లకు చెరో పాయంట్ ఇవ్వనున్నారు.
Rain Likely To Interrupt India newzealand match at dharmashala
sports,india,newzealand,ind vs nz,dharmashala,himachal cricket stadium,india vs nz match updates,rain,weather department,cyclone,temparatures,reserve day,cloudy weather