ICC WORLD CUP 2023 : వర్షం ఆటంకం.. బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
X
ఒక వైపు భీకర ఫామ్ లో, టోర్నీలో ఓటమి ఎరగని జట్టుగా దూసుకుపోతున్న సౌతాఫ్రికా, మరోవైపు పసికూనగా టోర్నీలో అడుగుపెట్టి, ప్రతీమ్యాచ్ లో ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తున్న నెదర్లాండ్స్ మధ్య వరల్డ్ కప్ లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. ధర్మశాలతో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఉదయం నుంచి ధర్మశాలలో వర్షం సూచన కనిపించింది. టాస్ పడగానే వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అవుతుంది.
పిచ్ రిపోర్ట్:
ధర్మశాల స్డేడియంలో చిన్న బౌండరీలు ఉన్న కారణంగా.. ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. పిచ్ పేస్ బౌలర్లకు సహకరిస్తుంది. సౌతాఫ్రికా జట్టు మొత్తం హిట్టర్లు ఉన్న కారణంగా నెదర్లాండ్స్ బౌలర్లకు చుక్కలు చూపించే అవకాశం ఉంది. అయితే వాళ్లనూ తక్కువ అంచనా వేయలేం. గత మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఎలా కట్టడి చేశారో తెలిసిన విషయమే.
తుది జట్లు:
నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దట్, పాల్ వాన్ మీకెరెన్
సౌతాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డికాక్ (w), టెంబా బావుమా (సి), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, గెరాల్డ్ కోయెట్జీ